Queen Review Ramya Krishnan is a majestic political leader jayalalitha
Queen Review Ramya Krishnan is a majestic political leader jayalalitha

గత కొన్నాళ్ళుగా బయోపిక్ ల కాలం నడుస్తోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం, పురచ్చితలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా పలు బయోపిక్స్‌ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు జయలలిత పై వెబ్ సిరీస్‌లు కూడా రెడీ అవుతున్నాయి. దేశమంతా ఈ బయోపిక్ ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ ‘తలైవి’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ జయలలితగా నటిస్తోంది. దీ,నికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ మూవీతో పాటు నిత్యామీనన్‌ కీలక పాత్రలో “ది ఐరన్‌ లేడీ’ పేరుతో మహిళా దర్శకురాలు ప్రియదర్శి ఓ సినిమా రూపొందిస్తోంది.

వీటికి పోటీగా మరో బయోపిక్ తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ జయలలిత జీవిత నేపథ్యంలో వెబ్‌ సిరీస్ నిర్మిస్తున్నారు.వెబ్ సిరీస్ లో నటి రమ్యకృష్ణ మరోసారి తన సత్తా చాటింది. బాహుబలి సినిమాలో శివగామిగా ఎంతగా అలరించి ఆకట్టుకుందో ఇప్పుడు క్వీన్ వెబ్ సిరీస్ ద్వారా కూడా అంతే మొత్తంలో అలరిస్తుంది.ఈ. ట్రైలర్ లో రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. బాల్యం నుంచి రాజకీయనేతగా ఎదిగిన తీరుని ఇందులో చాలా బాగా చూపించారు. రమ్య మార్క్ క్లిప్ లు ఇందులో కనిపిస్తాయి.

ప్రస్తుతం ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్వీన్ సినిమాను జనాలు విపరీతంగా చూస్తున్నారు. బాహుబలి వచ్చిన చాలా ఏళ్లకు మళ్లీ శివగామి స్థాయి పాత్రను రమ్యకృష్ణ చేసింది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత బయోపిక్ కు రమ్యకృష్ణ అద్బుతంగా సూట్ అయ్యిందని.. ఈమెతోనే సినిమా చేస్తే బాగుండేదనేది పలువురి అభిప్రాయం.అమ్మగా రమ్య మరో పాత్రలో ఒదిగిపోతున్నారు. ఈ వెబ్ సిరీస్ బయోపిక్ ల కంటే ముందే జనం ముందుకి రానుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.