#SDT15: మరోసారి సుప్రీమ్ కాంబో..?

338

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కరోనా కష్ట కాలంలో వసూళ్లను బాగానే అందుకుంది…చిత్రలహరి, ప్రతి రోజూ పండగే, విజయాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ కథానాయకుడు సాయితేజ్. ప్రస్తుతం వెర్సటైల్ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు.. అయితే ఆ సినిమా అనంతరం సాయి మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా అలాగే సుకుమార్ స్క్రీన్ ప్లే తో సుక్కు శిష్యుడు కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో ఒకటి..

డిసెంబర్ 24న పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఆ సినిమాలో సుప్రీమ్ హీరోయిన్ రాశి ఖన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చేతికొచ్చిన ఆఫర్స్ ను కూడా బ్యాడ్ లక్ తో చేజార్చుకుంటున్న ఈ బ్యూటీ మొత్తానికి మంచి ఆఫర్ అందుకున్నట్లు టాక్ వస్తోంది.

Raashi Khanna finalized for Sai Dharam Tej's next with Karthik Varma dandu

ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సుప్రీమ్, ప్రతి రోజూ పండగే మంచి విజయం సాధించాయి. మరి.. రాబోయే సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని మొత్తానికి సుకుమార్ ప్రొడక్షన్ లో సాయి ధరమ్ తేజ్ చేయబోయే సినిమాలో మంచి ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.