Raashi Khanna Role In Yodha: ఇండస్ట్రీలో కలిసి రావాలి అంటే బ్యూటీ ఒక్కటి ఉంటే సరిపోదు లక్ కూడా కావాలి. రాశీ ఖన్నా ఈ కోవకే చెందుతుంది. పాపం చాలా కాలంగా బిగ్ స్టార్టం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమెకు అనుకున్న రీతిలో అగ్ర కథానాయకుల పక్కన సినిమా చేసే అవకాశం రావడం లేదు. ఏదో అరకొరా ద్వితీయ శ్రేణి హీరోల సరసన నటించగలుగుతుంది కానీ వరుసగా స్టార్ హీరోలతో సినిమా ఆఫర్స్ కష్టమైపోతున్నాయి.
Raashi Khanna Role In Yodha: ఒక్క టాలీవుడ్ నే నమ్ముకుంటే కష్టమని అటు తమిళ్ మరియు హిందీలో కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తోంది ఈ గుమ్మడు. మరి తమిళ్లో క్లిక్ అవ్వాలి అని తీవ్రంగా శ్రమించి ఏదో కొన్ని విజయాలు అందుకుంది కానీ తన స్థాయిని మాత్రం పెంచుకోలేక బాధపడుతోంది. మరోపక్క ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్న సమంత (Samantha) మాత్రమే తెలివిగా వెబ్ సిరీస్ తో బిజీ అయిపోయింది.
సమంత బాటలోనే రాశీ (Raashi Khanna) కూడా రాజ్ అండ్ డీకే సపోర్టుతో ఫర్జీ వెబ్ సిరీస్ (Web Series) లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో రాశీ షాహిద్ సరసన నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో రాశీ మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ లో చేయడం వల్ల బాగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇదే ఊపులో తన స్టార్ డంను మరో లెవల్ కు తీసుకువెళ్లడానికి తెగ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
మరోపక్క బాలీవుడ్ లో నటవారసురలను ప్రమోట్ చేయడమే జీవిత ధ్యేయంగా గుర్తింపు పొందిన కరణ్ జోహార్ తో (karan johar) ప్రస్తుతం రాశీ (Raashi Khanna) ఫ్రెండ్షిప్ మంచి హాట్ టాపిక్ గా మారింది. కరణ్ నిర్మిస్తున్న భారీ ఎపిక్ ఓరియంటెడ్ మూవీ యోధాలో రాశీ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఎటువంటి గౌరవప్రదమైన నిర్మాణ సంస్థలో ఓ బలమైన పాత్ర పోషించే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఆమె కరణ్ జోహార్ కి కృతజ్ఞతను వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా స్టార్ హీరో వాళ్ళ సరస్సు నడవాలి అన్న ఆమె ఆశయం ఫలిస్తుందని ఆశిద్దాం….