Radhe Shyam Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలు థియేటర్లో సందడి చేసి మూడేళ్ల అవుతుంది. ప్రభాస్ (Prabhas) చాలా సినిమాల్ని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా రాధే శ్యామ్ (Radhe Shyam). ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుందని పుకార్లు వచ్చినప్పటికీ డైరెక్టర్ రాధాకృష్ణ వాటిని కొట్టివేయడం జరిగింది.


రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాని జనవరి 14న సంక్రాంతి కి రిలీజ్ చేద్దామని సన్నాహాలు చేశారు, అలాగే దానికి తగ్గట్టుగానే భారీగా రామోజీ ఫిలిం సిటీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. కానీ అనుకోని కారణాలవల్ల సినిమాని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ రాధాకృష్ణ దాదాపు నాలుగేళ్ల పాటు సినిమా స్టోరీ పైన పనిచేసి అలాగే దేశంలో వున్న ప్రముఖ రచయితలు ఈ మూవీ స్టోరీ కోసం పని చేశారని ఈ మూవీ తీయడానికే మూడేళ్లు పట్టిందని మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేటు (Radhe Shyam Release Date) అలాగే స్పెషల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసినట్టు ఫిలిం సర్కిల్ లో న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్వరలోనే స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించాలని బావిస్తున్నారట. అలాగే సినిమాని మార్చి నెలలో రిలీజ్ చేయాలని అప్పటికి కోవిడ్ ఆంక్షలు ప్రభుత్వం ఎత్తి వేస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే భారీ ఈవెంట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.


అయితే ఇది ఎంత వరకు నిజమన్నది మాత్రం క్లారిటీ లేదు. ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఇది వైరల్ అవుతోంది. మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే ఫిబ్రవరి లో `రాధేశ్యామ్` ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సి వుంటుంది. అందుకని ఈ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ చక్కెర్లు కొడుతోంది.