ప్రభాస్- పూజా హెగ్డే మధ్య విభేదాలు..?

0
1927
Radhe Shyam Team Reacts On Rumors Between Prabhas And Pooja Hegde War

Prabhas – Pooja Hegde: ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే కొన్ని సన్నివేశాలను విడివిడిగా చిత్రీకరించారని టాక్ నడుస్తోంది. ఈ సంగతి మేకర్స్ దృష్టికి వెళ్లింది. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయిన చిత్రయూనిట్.. అలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యువి క్రియేషన్స్ బిజీగా ఉండగా ఈ కొత్త రూమర్ వేడెక్కిస్తోంది.

ప్రభాస్, పూజాహెగ్డేలకు పడట్లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పారు యూనిట్ సభ్యులు. ఈ సినిమాలో ప్రభాస్- పూజా హెగ్డేల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని అన్నారు.

పూజాహెగ్డే షూటింగ్ కి ఆలస్యంగా వస్తుందనే విషయంపై కూడా స్పందించారు. పూజాహెగ్డే టైమ్ సెన్స్ పాటిస్తోందని.. ఆమెతో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను నమ్మొద్దని తెలిపారు.

Also Read: ఆ విషయంలో మహేష్ బాబు చిత్రయూనిట్ పై సీరియస్..!

Radhe Shyam Team Reacts On Rumors Between Prabhas And Pooja Hegde War

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త సమర్పణలో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read: పవన్, రానా మధ్య యుద్ధం స్టార్ట్..! 

 

Previous articleసూప‌ర్‌స్టార్ మ‌హేశ్ చేతుల మీదుగా ‘పెళ్లి సంద‌D’ ట్రైల‌ర్ విడుద‌ల‌
Next articleవెబ్ సిరీస్‌లో సాయిప‌ల్ల‌వి..!