గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ వచ్చేసింది

0
326
radhe-shyam-telugu-glimpse
radhe-shyam-telugu-glimpse

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌, పూజా హెగ్డే జోడీగా రూపొందుతోన్న ‘రాధేశ్యామ్‌’ పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మిస్తున్నారు. కాగా, ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14న ‘గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్’ వస్తుందని ప్రకటించడంతో ఈ చిత్ర గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అన్నట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్‌’ టీజర్ ను విడుదల చేశారు.

 

 

‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా..!? ఛాహ్.. వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు’ అనే సంభాషణ ఆకట్టుకుంటుంది. ప్రభాస్, పూజా జోడి స్క్రీన్ పై అందంగా కనిపించారు. జులై 30న ‘రాధేశ్యామ్‌’ థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత మందిస్తున్నాడు. మరోవైపు ప్ర‌భాస్ స‌లార్‌, ఆదిపురుష్ సినిమాల‌తోను బిజీగా ఉన్నాడు.