Pooja Hegde: Prabhas Radhe Shyam: సాహో, లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అక్టోబర్ నెలలో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేసిన మేకర్స్ ఇటలీ దేశానికి పయనమయ్యారట.
పిరియాడిక్ లవ్ స్టోరి జానర్లో వస్తోన్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న.. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ రాధే శ్యామ్ సినిమాను గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏమైఉంటుందని.. చాలా ఆసక్తిగా ఉన్నారు పూజా హెగ్డే అభిమానులు. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండదట. దాదాపు పూర్తి కావోచ్చిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆరు నెలల విరామం తర్వాత ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు.
ఈ మేరకు ఇటలీ లోని లొకేషన్స్ ఫైనల్ చేసిన చిత్రయూనిట్.. పదిహేను రోజుల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నారట. ఈ షెడ్యూల్లో ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్‌లో షూట్ చేయాల్సి ఉండటంతో మరికొద్ది రోజుల్లో ఫ్లైట్ ఎక్కాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా మరో రేంజ్లో ఉండే విధంగా ప్లాన్ చేశాడట దర్శకుడు రాధా కృష్ణ.