Latest Posts

రాఘ‌వ లారెన్స్ కాల భైరవ మూవీ ఫస్ట్ లుక్ అవుట్ నౌ

- Advertisement -

Raghava Lawrence’s 25th Film “Kaala Bhairava” First Look Released: కాల భైరవ సినిమ లో  వైవిధ్య‌మైన పాత్ర‌లు, చిత్రాల‌తో మెప్పిస్తోన్న డైన‌మిక్ స్టార్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నారు. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రూపొందుతుండ‌టం విశేషం. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రాక్ష‌సుడు, సెన్సేష‌న‌ల్ మూవీ ఖిలాడి వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతానికి Kaala Bhairava యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ మూవీ నిర్మాణాత్మ‌క ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  ఫ‌స్ట్ లుక్‌ను గ‌మనిస్తే ఇంట్రెస్టింగ్ అంశాల‌ను గ‌మ‌నించ‌వ్చు. ‘ది వ‌ర‌ల్డ్ విత్ ఇన్‌’, ‘ఏ ప్యాన్ ఇండియా సూప‌ర్ హీరో ఫిల్మ్’ వంటి లైన్స్ అంచ‌నాల‌ను ఆకాశానికెత్తేస్తున్నాయి. రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని కోనేరే స‌త్య‌నారాయ‌ణ‌, మనీష్ షా అత్యంత భారీగా రూపొందిస్తున్నారు.

- Advertisement -

Raghava Lawrence's 25th Film Kaala Bhairava First Look Released

‘కాల భైరవ’ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్నివివ‌రాల‌ను మేక‌ర్స్ తెలియ‌జేస్తారు.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles