Homeసినిమా వార్తలుఅటు డైరెక్టర్లను ..ఇటు హీరోలను ఇంట్లో కట్టిపడేసిన ప్రొడ్యూసర్స్… రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్

అటు డైరెక్టర్లను ..ఇటు హీరోలను ఇంట్లో కట్టిపడేసిన ప్రొడ్యూసర్స్… రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్

Raghavendra Rao says he wants Sita Ramam sequel, Sita Ramam 2 story, Sita Ramam 2, Raghavendra Rao Comments, Rashmika, Santosh Sobhan, Sita Ramam

K Raghavendra Rao : తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేవి వైజయంతి మూవీస్ మరియు గీతా ఆర్ట్స్. 1972 లో అశ్వినీ దత్ చలసాని ఆరంభించిన వైజయంతి మూవీస్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మించడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది. మరోపక్క అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలో గీతాలు ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను అందించింది. ఈ రెండు సంస్థలతో కలిసి పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో హిట్స్ సాధించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాజాగా ఇద్దరి గురించి అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

సంతోష్ శోభన్ మాళవిక నాయర్ కాంబినేషన్ లో ఎరకెక్కిన కొత్త చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ .. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్స్ పై అశ్విని దత్తు కుమార్తెలు ఆయన స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వ భాగ్యతలను నందిని రెడ్డి నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న రాఘవేంద్రరావు లెజెండ్రీ నిర్మాతలు ఇద్దరి పైన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

K Raghavendra Rao : అశ్వినీ దత్,అల్లు అర్జున్ మరియు రాఘవేంద్రరావు స్నేహానికి 30 ఏళ్లు నిండిన సందర్భంగా…వారి స్నేహాన్ని మరియు చిత్రసీమతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ‘అన్నీ మంచి శకునములే’ మూవీ టీమ్ బంతి భోజనం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవేందర్ రావు స్వప్న దత్ మరియు ప్రియాంక చివరిగా నిర్మించినటువంటి సీతా రామం చిత్రంని ప్రశంసించారు. అయితే ఈ చిత్రంకు సంబంధించి తనకు ఒకే ఒక బాధ కూడా ఉంది అని ఆయన అనడం విశేషం.

సీతా రామం సినిమాలో సీత పాత్ర…మరియు ఆమె జీవితం సర్వనాశనమైన వైనం తనకు బాధగా ఉందని రాఘవేంద్రరావు అన్నారు. నాకు ఒక ఐడియా ఉంది మీ డైరెక్టర్ కి చెప్తాను…. విలన్ దగ్గరకు వెళ్లి కాల్చపోతే వాడు గుహలో నుంచి ఎక్కడెక్కడికో తీసుకువెళ్లిపోయి రామ్ చావలేదని చెప్తాడు…. అప్పుడు వాళ్ళిద్దరూ తప్పించుకుంటే …విలన్స్ ఎలా ఛేజ్ చేస్తారు అనే కోణంలో స్టోరీ చేయండి…”అని రాఘవేంద్రరావు సీతారామం సీక్వెల్ కి హింట్ కూడా ఇచ్చారు. ఆయన మాటలకు స్పందించిన స్వప్న…మీరు జగదేకవీరుడు సీక్వెల్ గురించి ఆలోచించండి అని సరదాగా అన్నారు. దీనికి రాఘవేంద్రరావు వే ప్రియాంకను పిలిచి మీ హస్బెండ్ నాగ అశ్విన్ తో ఆ సినిమాలు తలకెక్కించమని కూడా సూచించారు.

Raghavendra Rao says he wants Sita Ramam sequel

ప్రస్తుతం తనలాంటి డైరెక్టర్ అవసరం అశ్వినీ దత్ మరియు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్స్ కి లేదని రాఘవేంద్రరావు అన్నారు. అశ్వినీ దత్ అల్లుళ్ళని ఇంట్లోనే కట్టేసి పెట్టుకున్నాడు…మరోపక్క అల్లు అరవింద్ హీరోలను ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు…ఇక వీళ్లిద్దరికీ నాతో పని తీరిపోయింది.. అయినా మేము ఎప్పటికీ స్నేహితులను అని రాఘవేంద్రరావు అన్నమాట అందరినీ సర్ప్రైజ్ చేశాయి.

- Advertisement -

Web Title: Raghavendra Rao says he wants Sita Ramam sequel, Sita Ramam 2 story, Sita Ramam 2, Raghavendra Rao Comments, Rashmika, Santosh Sobhan, Sita Ramam

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY