Homeసినిమా వార్తలుఅనసూయా ట్విట్టర్ వార్ పై కమెడియన్ రాహుల్ రామకృష్ణ సెటైర్..!

అనసూయా ట్విట్టర్ వార్ పై కమెడియన్ రాహుల్ రామకృష్ణ సెటైర్..!

Rahul Ramakrishna comments on Anasuya tweet, Rahul Ramakrishna Doubt On Anchor Anasuya Tweet, Vijay Devarakonda, Anasuya twitter war,

Rahul Ramakrishna – Anasuya: టాలీవుడ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ రోజుకో కొత్త రకమైన ఇష్యూ తో ట్విట్టర్లో ఏదో ఒక సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేసి పెట్టిన ట్వీట్ పెద్ద వారికి నాంది పలికింది. ఒకపక్క విజయ్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మరోపక్క విజయ్ ఫ్రెండ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కూడా ఓ రేంజ్ లో అనసూయకు పంచ్ లు ఇచ్చారు.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అప్కమింగ్ చిత్రమైన ‘ఖుషి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ గురించి మేకర్స్ ఇటీవల ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ పేరుకు ముందు ది అని పెట్టడంపై అనసూయ పరోక్షంగా సెటైర్ వేస్తూ పెట్టిన ట్వీట్ పెద్ద వివాదానికి దారితీసింది. ‘బాబోయ్ ‘ది’ అంట.. పైత్యం.. అంటకుండా చూసుకోవాలి’అని అనసూయ (Anasuya) పెట్టిన ట్వీట్ కు ఆగ్రహించిన రౌడీ ఫాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఆంటీ అని పిలవడంతో పాటు అసభ్యకర పదజాలం కూడా వాడారు.

అయితే వీటికి జంకని అనసూయ (Anasuya) ఆ కామెంట్స్ ని (Comments) స్క్రీన్ షాట్స్ తీసి మరి రేట్ చేసి ట్విట్టర్లో వార్ కి పిలుపునిచ్చింది. గత రెండు మూడు రోజులుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది…అయితే తన గురించి అసభ్యంగా మాట్లాడుతున్న వారిని తాజాగా ఓ ట్వీట్ లో రంగం అత్త గట్టిగానే దులిపింది. “నువ్వు నన్ను తిడితే.. తప్పు నీ కంపు నోరుది అవుతుంది కానీ నాది ఎందుకు అవుతుంది…నా పెంపకం గర్వించదగినది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పడం నాకు మొదటినుంచి నేర్పించారు. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. అవమానించే వారు సిగ్గుపడాలి కానీ అవమానించబడిన వారు కాదు.” అని ఆమె తన ట్వీట్ లో తనని విమర్శించే వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

Rahul Ramakrishna comments on Anasuya tweet

అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ వార్ పై కామెడీ యాక్టర్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) వినూత్నంగా స్పందించారు. “ఈ విషయం గురించి తెలియనందుకు క్షమించండి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది”అని రాహుల్ పెట్టిన ట్వీట్ కు అనసూయ నుంచి రిప్లై రాలేదు కానీ నేటిజన్లో మాత్రం ..”వదిలేయ్ అన్న లైమ్‌లైట్‌లో ఉండడం కోసం కావాలని లేనిపోనివి పంచాయితీ చేస్తుంది…ఎప్పుడు బెకారము ముచ్చట్లే…ఊరికే రెచ్చగొట్టడం తర్వాత డిఫరెంట్ చేయడం…అంతా డైలీ రొటీన్ అయిపోతుంది”అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అనసూయ బోల్డ్ లుక్స్ తో ఉన్న పిక్చర్స్ ని షేర్ చేసి గర్వించదగిన పెంపకం అంటే ఇదేనా ….దెయ్యాలు వేదాలు వల్లించడం ఎలాగో మీరు శ్రీరంగనీతులు చెప్పడం అలాగ ..అని కౌంటర్లు ఇస్తున్నారు.

Web Title: Rahul Ramakrishna comments on Anasuya tweet, Rahul Ramakrishna Doubt On Anchor Anasuya Tweet, Vijay Devarakonda, Anasuya twitter war.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY