Rahul sipligunj comments on About Sreemukhi relationship
Rahul sipligunj comments on About Sreemukhi relationship

రాహుల్-శ్రీముఖి.. లేటెస్ట్ బిగ్ బాస్ షోలో మెయిన్ కంటెస్టెంట్లు. ముఖ్యంగా వీరిద్దరి వైపే అభిమానులు మొగ్గు చూపారు. సోషల్ మీడియాలో కూడా రెండు వర్గాలుగా విడిపోయిన వీళ్ళ అభిమానులు.. ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. మైక్ లు ముందు పెడితే చాలు రాహుల్ మంచోడని.. శ్రీముఖినే అతన్ని టార్గెట్ చేసిందంటూ వాపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఫైనల్స్ కూడా ఇద్దరి మధ్య హోరాహోరీ గా సాగింది. శ్రీముఖి గెలుస్తుందని చాలా మంది ఊహించారు. వారి ఊహలకు అందకుండా రాహుల్ విజేతగా నిలిచాడు. మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు. కానీ అన్ని వారాల పాటూ బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వలన శ్రీముఖినే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ సంపాదించిందని వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ పూర్తయ్యాక కూడా ఒకరినొకరు పెద్దగా మాట్లాడుకోడాలు లేవు. కేవలం తిట్లు మాత్రమే ఉండేవి. తాజాగా రాహుల్ పెట్టిన ఓ పోస్టు మాత్రం అందరినీ షాక్ కు గురిచేసింది.

“అసలు రిలేషన్ ఇప్పుడే మొదలైంది” అంటూ రాహుల్ పోస్టు చేసిన సెల్ఫీ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. శ్రీముఖి కూడా ఇదే ఫొటోను పోస్టు చేసింది. దీనికి “గతం గతః” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్యన ఎటువంటి సమస్య లేదని.. గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఓ పార్టీలో సందడి చేశారు. దానికి సంబందించిన ఓ వీడియోను వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే వీడియోను శ్రీముఖి తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసింది. ఆ వీడియోలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, వితికలు కనిపించారు.

బిగ్ బాస్-3 విన్నర్ గా నిలిచిన రాహుల్ కు టాలీవుడ్ లో మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కృష్ణవంశీ రాహుల్ కు ఈ సినిమాలో అవకాశాన్ని ఇచ్చారు. గత సీజన్ లలో బిగ్ బాస్ లో విన్నర్లుగా నిలిచిన శివ బాలాజీ, కౌశల్ లకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ రాహుల్ మాత్రం మంచి ఛాన్స్ సంపాదించుకున్నాడు. రాహుల్ గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. రామ చక్కని సీత అనే సినిమాలో కూడా ఓ చిన్న క్యారెక్టర్ చేశాడు కానీ అది పెద్దగా రాహుల్ కెరీర్ కు ప్లస్ అవ్వలేదు. రంగమార్తాండ సినిమా అయినా రాహుల్ యాక్టింగ్ కెరీర్ కు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.