Raj Tarun and Shalini Pandey Iddari Lokam Okate Telugu Movie Review
Raj Tarun and Shalini Pandey Iddari Lokam Okate Telugu Movie Review

సమీక్ష : ఇద్దరి లోకం ఒకటే
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019
నటీనటులు: రాజ్ తరుణ్, షాలినీ పాండే..
రేటింగ్: 2.5/5
నిర్మాత: శిరీష్
దర్శకత్వం: జిఆర్ కృష్ణ
సినిమాటోగ్రఫీ: స‌మీర్ రెడ్డి
మ్యూజిక్: మిక్కీ జె.మేయ‌ర్‌
ఎడిటర్‌: తమ్మి రాజు

వరుస పరాజయాలతో పూర్తిగా ఢీలా పడిపోయి ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ – అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే జంటగా నటించిన లవ్ స్టోరీ ‘ఇద్దరి లోకం ఒకటే’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

ఇక కథలోకి వెళ్లినట్టయితే సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే హీరో రాజ్ తరుణ్ మరియు హీరోయిన్ షాలిని పాండే పాత్రలు చిన్ననాడే విడిపోయి..మహి(రాజ్ తరుణ్) ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్, వర్ష(షాలిని పాండే) హీరోయిన్ కావాలనుకునే ఒక స్ట్రగుల్ యాక్టర్. వర్ష చిన్ననాటి ఫొటోగ్రాఫ్ వల్ల అనుకోకుండా తారసపడిన మహి అండ్ వర్ష, చిన్నతనంలోనే ఫ్రెండ్స్ అయ్యుంటారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన వీరు మళ్ళీ విడిపోడానికి కారణం ఏమిటి?ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తన గురించి తెలుసుకున్న ఓ కీలక నిజం ఏమిటి?దాని వలన రాజ్ తరుణ్ కు ఏమవుతుంది?ఇంతకీ వీరిద్దరి ప్రేమ ఎలా సక్సెస్ అయ్యింది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

రాజ్ తరుణ్ మరియు షాలిని పాండేల మధ్య కెమిస్ట్రీ
పాటలు

మైనస్ పాయింట్స్ :

అంత ఎంటర్టైనింగ్ గా సాగకపోవడం
చాలా నెమ్మదిగా సాగే కథనం
రొటీన్ స్టోరీ

విశ్లేషణ :

లవ్ స్టోరీలు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.ప్రేమ ఒకటే అయినా సరే దానిని సరిగ్గా తెరకెక్కిస్తే ఎవరైనా సరే బాగా కనెక్ట్ అవుతారు. ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటూ రాజ్ తరుణ్ ఈ సారి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు. తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి బాగానే తాపత్రయ పడ్డాడు. ఎక్కువుగా సరదాగా తిరిగే కుర్రాడి పాత్రలతో మరియు తన ఈజ్ యాక్టింగ్ తో ఆకట్టుకునే రాజ్ తరుణ్ నుండి.. ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావడంతో ఫ్రెష్ గా అనిపించింది.

రాజ్ తరుణ్ మరియు షాలిని పాండేలు అద్భుతమైన నటన కనబర్చారు.సాంగ్స్ లో కానీ కెమిస్ట్రీ ఎపిసోడ్స్ లో కానీ ఈ ఇద్దరి ఫైర్ చిత్రంలో చాలా బాగుంది.కాకపోతే ఫస్ట్ హాఫ్ లోని కథ కాస్త నెమ్మదిగా సాగడం మూలానా సినిమా చూసే ప్రేక్షకుడికి మొదటి నుంచే అంతలా ఆసక్తి కలకగకపోవచ్చు.అలా అలా నెమ్మదిగా పర్వాలేదనిపిస్తుంది.పై పెచ్చు అసలు స్టోరీ ఏమిటి అన్నది తెలుసుకోడానికి కూడా కాస్త సమయం ఎక్కువే తీసుకున్నట్టు అనిపిస్తుంది.వీటి మూలాన చిత్రంపై పెద్దగా ఆసక్తి పెరగకపోచ్చు.కానీ ఆ తర్వాత నుంచి మెల్లగా స్క్రీన్ ప్లై డీసెంట్ గా కొనసాగుతుంది.కథానుసారం వచ్చే సాంగ్స్ మరియు లొకేషన్స్ ముఖ్యంగా ఊటీ లొకేషన్స్ లో సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో షాలినీ మెప్పించింది. హీరోయిన్ కి మదర్ గా నటించిన రోహిణి ఎప్పటిలాగే తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంది. దర్శకుడు జి.ఆర్‌.కృష్ణ ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. చిత్రం చూసినంత సేపు ఒకటే సీరియస్ నోట్ పై కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఆ ప్రేమకు సరైన సంఘర్షణ కూడా లేదు. దీనికి తోడు ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు. అంతే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువ ఉండడం ఫస్ట్ హాఫ్ లో కాస్త డల్ స్క్రీన్ ప్లే లు మైనస్ గా చెప్పొచ్చు.కానీ సెకండాఫ్ మరియు క్లైమాక్స్ లో సాగే ఎమోషనల్ సీన్స్ మరియు మలుపులు కనెక్ట్ అవుతాయి.

ఈ చిత్రంలోని క్లైమాక్స్ కాన్సెప్ట్ అందరినీ మెప్పించకపోవచ్చు.చాలా కాలం తర్వాత మిక్కీ సంగీతం కాస్త ఫ్రెష్ గా అనిపిస్తుంది. మరో కీలక పాత్రలో నటించిన నాజర్, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. తమ్మిరాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను అయన తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.

తీర్పు :

ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ ‘ఇద్దరి లోకం ఒకటే’ ఆసక్తికరంగా సాగలేదు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్ మరియు జి ఆర్ కృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మంచి లొకేషన్స్ సాంగ్స్ వంటివి ఆకట్టుకుంటాయి.. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తాయి. కానీ రొటీన్ స్టోరీ పైగా నిడివి తక్కువే అయినా కూడా బోరింగ్ గా సాగే కథనాలు ప్రేక్షకుడిని ఓవరాల్ గా ఖచ్చితంగా మెప్పించలేవు.. కాకపోతే లవర్స్ కి సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోవచ్చు.