రాజ్ త‌రుణ్ ‘అనుభ‌వించు రాజా’ OTT రిలీజ్ డేట్..!!

Anubhavinchu Raja OTT Release Date: రాజ్ త‌రుణ్, కాషిష్ ఖాన్ జంట‌గా న‌టించిన గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఎంట‌ర్‌టైన‌ర్ ‘అనుభ‌వించు రాజా’. ఎ సినిమాలో సుద‌ర్శ‌న్‌, ఆడుగ‌లం న‌రేన్‌, అజ‌య్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీను గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగ‌డ్డ నిర్మించారు.

ఈ సినిమాని ఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి ఆహా లిస్టులో మ‌రో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేరింది. అనుభ‌వించు రాజా (Anubhavinchu Raja) చిత్రం ఆహా (Aha OTT) ప్రీమియ‌ర్‌గా డిసెంబ‌ర్ 17న ప్ర‌సారం కానుంది.

గ్రామంలో ఉండేటువంటి రాజ‌కీయాలు, యాక్ష‌న్‌, హాస్యం వంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. భీమ‌వ‌రంలో ఉ ండే బంగార్రాజు అలియాస్ బంగారం అనే యువ‌కుడి చుట్టూ తిరిగే క‌థే అనుభ‌వించు రాజా. బంగార్రాజు ఓ ప్ర‌మాదంలో త‌న కుటుంబాన్ని కోల్పోతాడు. తాత‌య్య ద‌గ్గ‌ర పెరుగుతాడు. ఆయ‌న చ‌నిపోతూ జీవితాన్ని స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని చెబుతాడు. ఉన్న డ‌బ్బునంతా జ‌ల్సాల కోసం వాడేస్తుంటాడు.

aha OTT to premiere Raj Tarun's 'Anubhavinchu Raja' on Dec 17
aha OTT to premiere Raj Tarun’s ‘Anubhavinchu Raja’ on Dec 17

కొన్ని అనుకోని ప‌రిస్థితుల్లో బంగార్రాజు జైలు కెళ్లాల్సిన ప‌రిస్థితి వస్తుంది. ఆ స‌మ‌యంలో ప‌ట్నంకు వెళ్లి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అవుతాడు. అదే కంపెనీలో ప‌ని చేసే శ్రుతి అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకు త‌న గ‌తాన్ని తెలియ‌కుండా బంగార్రాజు జాగ్ర‌త్త ప‌డుతుంటాడు. అస‌లేం జ‌రిగింది? చివ‌ర‌కు బంగార్రాజు జీవితం ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే క‌థ‌.

Follow @chitrambhalareI twitter account for daily updates   

Related Articles

Telugu Articles

Movie Articles