రివ్యూ: రాజ రాజ చోర

0
4096
sri vishnu raja raja chora telugu Review rating

Raja Raja Chora Review Rating
విడుదల తేదీ : ఆగస్టు 19, 2021
రేటింగ్ : 3/5
తారాగణం: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు తదితరులు
దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాత : టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్
సంగీతం : వివేక్ సాగర్
స్క్రీన్ ప్లే : హసిత్ గోలి

శ్రీవిష్ణు సినిమా అంటే అందులో క‌చ్చితంగా ఓ కొత్త క‌థ ఉంటుంద‌ని నమ్మేంత‌గా ప్రేక్ష‌కుల‌పై ఆయ‌న ప్ర‌భావం చూపించారు. అందుకే జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమా వ‌స్తోందంటే ప్ర‌తిసారీ ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.

Raja Raja Chora Review Rating in telugu

కథ : భాస్కర్ (శ్రీవిష్ణు) ఒక జిరాక్స్ షాప్ లో పని చేస్తూ.. సాఫ్ట్ వేర్ ఇంజీనియర్ అని అబద్ధం చెప్పి సంజన ( మేఘా ఆకాశ్)ను లవ్ చేస్తూ ఉంటాడు.అవ‌స‌రాలు అత‌న్ని ఓ దొంగలా మార్చేస్తాయి. అనూహ్య ప‌రిణామాల త‌ర్వాత భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌నీ… అత‌నికి విద్య (సునయన) అనే మ‌రో అమ్మాయితో పెళ్ల‌య్యింద‌ని, వాళ్లిద్ద‌రికీ ఓ అబ్బాయి కూడా ఉన్నాడ‌నే విష‌యం సంజ‌న‌కి తెలుస్తుంది. మరి భాస్కర్ కి నిజంగానే పెళ్లి అయిందా ? విద్య ( సునైన) భాస్కర్ కి ఏమి అవుతుంది ? ఈ మధ్యలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

బ‌లాలు
క‌థ‌
శ్రీవిష్ణు న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు
అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు
ద్వితీయార్ధం

Raja Raja Chora Review Rating

నటీనటులు:
శ్రీవిష్ణు మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటారు. దొంగ‌గా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో క‌నిపించిన తీరు, హాస్యం… భావోద్వేగాల్ని పండించిన విధానం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. మేఘ ఆకాష్, సునయన పాత్ర‌లు కూడా క‌థ‌లో కీల‌కం. మేఘ అందంగా క‌నిపించ‌మే కాదు, ఆమె అభిన‌యం కూడా ఆక‌ట్టుకుంటుంది.

గంగ‌వ్వ, శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌, అజ‌య్ ఘోష్, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు పోషించిన చిన్న పాత్ర‌లు, వాళ్ల న‌ట‌న కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ పాటలు, నేప‌థ్య సంగీతం క‌థ‌కి ప్రాణం పోసింది. వేద రామ‌న్ కెమెరా ప‌నిత‌నం, విప్ల‌వ్ కూర్పుతో పాటు ఇత‌ర విభాగాలు కూడా చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి.

Raja Raja Chora 123 telugu Review Rating

విశ్లేషణ:
దొంగ వాల్మీకి ఎలా అయ్యాడో… అలా ఓ దొంగ త‌న జీవితంలో చెందిన ప‌రివ‌ర్త‌నమే ఈ చిత్రం. మ‌న‌సు ఒక‌టి చెబుతున్నా‌… డ‌బ్బు కోసం మ‌రొక‌టి చేయ‌డం కూడా త‌ప్పే అనే సందేశాన్ని సునిశిత‌మైన హాస్యం, భావోద్వేగాలు, డ్రామాని మేళ‌వించి చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. శ్రీవిష్ణు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు తన క్యారెక్టరైజేషన్ తో వచ్చే ఫన్ తో బాగా నవ్వించాడు. ఇక కథానాయకగా నటించిన మేఘా ఆకాశ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా నటించిన సునైన సీరియస్ రోల్ లో ప్లజంట్ గా నటించింది.

మంచి క‌థ‌, క‌థ‌నం, పాత్రలతో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అయితే చాలా స‌న్నివేశాలు నెమ్మ‌దిగా సాగ‌డం ఇబ్బంది పెడుతుంది. పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి బాగా స‌మ‌యం తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. భాస్క‌ర్ – విద్యల నేప‌థ్యంలో స‌న్నివేశాలు మొద‌ల‌య్యాకే క‌థ‌లో వేగం పెరుగుతుంది. విరామ స‌న్నివేశాల‌కి ముందు భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌నే విష‌యం తెలిసిన‌ప్పుడూ… రాజు దొంగ‌గా శ్రీవిష్ణు ప‌ట్టుబ‌డిన‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి.

raja raja chora Greatandhra review

సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన రవిబాబు ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. మరో కీలక పాత్రలో కనిపించిన తనికెళ్ల భరణి పాత్ర స్క్రీన్ ప్లేని వివరిస్తూ కథను ముందుకు నడిపిన విధానం బాగుంది. దర్శకుడు హసిత్ గోలి ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపాడు. అలాగే సెకండాఫ్ లో మంచి మెసేజ్ ఇస్తూ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసాడు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే అలాగే కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బావుంది.

ప్రతీ పాత్ర వెన‌క రెండో కోణాన్ని ఆవిష్క‌రించిన తీరు, ప‌తాక స‌న్నివేశాల్లో అజ‌య్ ఘోష్ చెప్పే సంభాష‌ణ‌లు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. మొత్తమ్మీద ఈ సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది.