మహేష్-రాజమౌళి కాంబోలో భారీ బడ్జెట్‌ సినిమా

0
627
rajamouli-and-mahesh-combo-to-make-huge-budget-movie
rajamouli-and-mahesh-combo-to-make-huge-budget-movie

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబో. వీరి కాంబోలో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. జక్కన్నతో సినిమా చేసేందుకు మహేష్ కూడా రెడీ అనడంతో వారి కాంబోలో కచ్చితంగా సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ ఈ సినిమాపై ఇప్పటి వరకు సరైన అప్‌డేట్ రాలేదు. ఈ క్రమంలో అనేక రూమర్లు వెలుగు చూశాయి.

 

 

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్-రాజమౌళి కాంబో మెగా బడ్జెట్ సినిమా రాబోతుందని, ఈ సినిమా బాక్సఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా అడవి ప్రాధాన్యంలో తెరకెక్కనున్న యాక్షన్ అడ్వెంచర్‌ అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా లొకేషన్ కోసం ఆఫ్రికన్ అడవులను సెలక్ట్ చేస్తున్నారు. ఈ వార్తలన్నీ నిజమేనని కేవి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఈ వార్త విన్న అభిమానులకు ఇక పూనకాలు తప్పవు. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబోలో సినిమా, అంతేకాకుండా మహేష్ హీరోగా అడ్వేంచర్ సినిమా అంటే కచ్చితంగా డబుల్ ధమాకా అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది.

Previous articleMahesh Babu wishes wife Namrata on 16th wedding anniversary
Next articleRAASHI KHANNA LOOKS STUNNING IN THE BIKINI PHOTOSHOOT PICS GOES VIRAL