Rajamouli Changes For Prabhas Saaho Movie
Rajamouli Changes For Prabhas Saaho Movie

సాహో అనే భారీ సినిమా అతి భారీగా రిలీజ్ అవుతుంది అనే విషయం ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే.ఈ సినిమా ఫినిషింగ్ వర్క్స్ కూడా ఒక కొలిక్కి వచ్చాయి.అయితే ఈ సినిమా రన్ టైం ముందే లాక్ చేశారు.ఆల్మోస్ట్ రెండు గంటల 48 నిమిషాల అవుట్ ఫుట్ తో ఫైనల్ కాపీ ఓకే అనుకున్నారు.ఆ కాపీ ని లెజెండరీ డైరెక్టర్ రాజమౌళికి చూపించారు.అయితే ఆ సినిమా చూసిన రాజమౌళి సినిమా లెంగ్త్ ఎక్కువ అయ్యిందని అది కట్ చేస్తే సినిమా సక్సెస్ విషయంలో ఎలాంటి కంగారు అక్కర్లేదు అని చెప్పాడు అని క్లోజ్ సోర్సెస్ సమాచారం.

దాంతో డైరెక్టర్ సుజీత్ స్టోరీ కి సంబంధం లేకుండా కాస్త లెంగ్తీ గా అనిపించిన ఎపిసోడ్స్ ని దాదాపు 18 నిమిషాల మేర కట్ చేసి రెండున్నర గంటల అవుట్ ఫుట్ ని లాక్ చేసారు.ఇది పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త అవసరం.కోట్లు ఖర్చుపెట్టి తీసాం కదా అని సీన్స్ అన్నీ ఉంచుకుంటూ పోతే చివరికి సినిమా సక్సెస్ కి అవే ఆటంకంగా మారే అవకాశాలు ఉన్నాయి.అందుకే సినిమా టీమ్ కూడా ఆ విషయంలో జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది.ఇప్పటివరకు సినిమా టీమ్ మాత్రమే సినిమా చూసుకుని కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.ఇక ఇప్పుడు రాజమౌళి స్టాంప్ కూడా పడింది కాబట్టి సాహో ఈ నెల 30 న కలెక్షన్స్ సునామి తో ప్రపంచవ్యాప్తంగా సంచనలనం సృష్టించడానికి పూర్తిగా రెడీ అయిపోయింది.

 

Consider these articles: