RRR మూవీ కి ఆస్కార్ వచ్చిన నేను అక్కడ సినిమాలు చేయను: రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఆస్కార్ నామినేషన్ లిస్ట్ లో కూడా ఉన్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విడుదలైన తర్వాత 1,100 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది.

RRR సినిమాకి ఇతర దేశాల్లో కూడా గుర్తింపు వచ్చింది. దానితోపాటు ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల టొరొంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజమౌళి పాల్గొని ఆర్ ఆర్ ఆర్ సినిమా విశేషాలను అక్కడి వారితో మీడియాతో షేర్ చేసుకున్నాడు.

ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ లో ప్రేక్షకులతో కలిసి రాజమౌళి ఈ సినిమాని చూడటం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు ఈ సినిమాకి తప్పకుండా ఆస్కార్ వస్తుందని చెప్పటం తో రాజమౌళి సర్ ప్రైజ్ అయ్యారు. ఇక RRR సినిమాకు ఆస్కార్ ఖాయం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ” ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ వచ్చినంత మాత్రాన నా స్టైల్ మారదని.. తెలుగు లో తీసిన సినిమాలు ఎన్ని ఇండియా లెవెల్ లో విడుదల చేయటానికి ప్రయత్నం చేస్తానని చెప్పటం జరిగింది.. దీనితోపాటు నాకు బాలీవుడ్ లో కూడా చాలా ఆఫర్లు వచ్చినా అని కానీ నేను అక్కడ సినిమాలు చేయడం వంటివి చేయను అని ఆయన క్లారిటీ ఇచ్చాడు.”

రాజమౌళి ఆస్కార్ గురించి ప్రస్తావిస్తూ.. మన తెలుగు సినిమాకి ఆస్కార్ దొరకటం చాలా అదృష్టం అని.. రాబోయే రోజుల్లో ఇలాంటి సినిమాలు తీయటానికి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని రాజమౌళి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles