Rajamouli confirmed 3 songs for Jr NTR Ram charan RRR Movie
Rajamouli confirmed 3 songs for Jr NTR Ram charan RRR Movie

ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రధాన భాషలన్నిటిలోనూ చిత్రం విడుదలకానుంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయట. అలాగే ఇంకొక పాట నేపథ్య సంగీతంతో పాటు పలు సన్నివేశాల్లో వినబడుతుందట.

ఈ చిత్రం అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లాంటి స్వాతంత్ర్య యోధుల కథలతో కూడుకున్నది కావడంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో ఆరు పాటలు అనే ఫార్ములాను రాజమౌళి పక్కన పెట్టినట్లు ఉన్నాడు. మొత్తానికి కీరవాణికి పని తగ్గించాడు రాజమౌళి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి. అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇక రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రబోర్తిని తీసుకోనున్నారని తెలుస్తోంది. గతంలో ఇదే పాత్రలో నిత్యా మీనన్ ను తీసుకోవాలనుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా ఎన్టీఆర్ చరణ్ లుక్స్ పై ఇండస్ట్రీలో అమితాసక్తి నెలకొని ఉంది.

ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా, చరణ్ ని అల్లూరి గెటప్ లో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే వారి లుక్స్ రాజమౌళి ఎలా డిజైన్ చేయనున్నారు అనేది ఆసక్తికరం. వాస్తవానికి కొమరం భీమ్ కోరమీసం, తలపాగాలో ఉంటారు కాబట్టి, ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ గురించి అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇక అల్లూరి సీతారామ రాజు బాగా పెరిగిన గడ్డం మరియు జులపాలతో ఉంటారా..? ఒక ప్రక్క ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నా చరణ్ మాత్రం జుట్టు పెంచలేదు. మరి అల్లూరిగా చరణ్ ని చూపించడానికి జక్కన్న విగ్ ఏమైనా వాడుతాడా..? లేక, కొమరం భీమ్ లుక్ లానే తలపాగాతో లాగించేస్తారా.. చూడాలి.