rajamouli plans to start rrr shooting in this month

RRR Update: Ram Charan, NTR: బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమాకు క‌రోనా బ్రేక్ వేసింది. ఆరు నెలలుగా వాయిదాపడ్డ RRR షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆయన పక్కాగా ప్లాన్ చేశారని, నటీనటులను క్వారంటైన్‌లో ఉంచబోతున్నారని తెలుస్తోంది.

అయితే ఇటీవలే తిరిగి షూటింగ్స్‌కి అనుమతి లభించినా కరోనా ఉదృతి తగ్గలేదని సెట్స్ మీదకు రాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరులో అయినా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్సయిన జక్కన్న.. అన్నీ పక్కాగా ప్లాన్ చేశారట. షూటింగ్స్‌కు హాజ‌ర‌వ్వాలి అంటే క్వారంటైన్‌లో ఉండ‌డంతో పాటు టెస్ట్ చేయించుకోవాల‌నే నిబంధ‌న‌లు పెట్టార‌ట‌. దీంతో ఈ నెల 10వ తేదీ నుంచి నటీనటులందరినీ క్వారంటైన్‌లో ఉండాలని రాజమౌళి సూచించినట్లు తెలుస్తోంది.

ఒక్కసారి షూటింగ్ ప్రారంభమయ్యాక ఇబ్బందులు తలెత్తకుండా తన వంతుగా ఈ చర్యలు తీసుకుంటున్నానని టీం అందరితో చెప్పి సహకరించాలని కోరారట జక్కన్న. అలాగే షూటింగ్‌ స్పాట్‌లో ఉపయోగించే సామాగ్రిని ప్రత్యేకంగా శానిటైజేషన్‌ చేయించటం, థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయబోతున్నారట రాజమౌళి.

వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్ధంలో సినిమాని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో జ‌క్క‌న్న ఉన్నాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు.