భారీ ధరకు అమ్ముడైన ‘RRR’ డిజిటల్‌ రైట్స్‌

324
rajamouli-ramcharan-ntr-rrr-satellite-rights-sold-for-huge-price
rajamouli-ramcharan-ntr-rrr-satellite-rights-sold-for-huge-price

టాలీవుడ్‌ జక్కన రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.

 

అంచనాలకు తగ్గట్లుగానే రాజమౌళి ఈ సినిమాను భారీ స్టారింగ్‌తో పాటు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలకు తెరతీస్తోంది. భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా బిజినెస్‌ కూడా అదే స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు భాషల హక్కులు అత్యధిక ధరకు అమ్ముడు పోగా.. ఇప్పుడు డిజిటల్‌ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

 

 

ఇంత వరకు భారత సినిమా ఇండస్ట్రీలో లేని విధంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ డిజిటల్‌ హక్కులు ఏకంగా రూ.200 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. ప్రముఖ మీడియా సంస్థ స్టార్‌ నెట్‌వర్క్‌ ఈ భారీ మొత్తానికి ఆర్‌.ఆర్‌.ఆర్‌ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

 

 

డిజిటల్‌ రైట్స్‌కు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలోనే స్టార్‌ గ్రూప్‌ ఈ స్థాయిలో వెచ్చించినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో నటిస్తున్నాడు. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌ విడుదలకు ముందే ఇలా సంచలనాలు సృస్టిస్తుంటే.. ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తోందో వేచి చూడాలి.

 

 

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామచరణ్ పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్లు నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.