Homeసినిమా వార్తలుSSMB29 Story: మహేష్ సినిమా కథేంటో చెప్పిన రాజమౌళి

SSMB29 Story: మహేష్ సినిమా కథేంటో చెప్పిన రాజమౌళి

Rajamouli Reveals SSMB29 Story: RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతుంది. దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో SSMB 29 స్టోరీ లైన్ ని చెప్పడం జరిగింది.

Rajamouli Reveals SSMB29 Story: ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమాని ప్రపంచ దేశాల్లో ప్రచారాలు బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైన విషయం తెలిసిందే. రాజమౌళి తరవాత రాబోయే సినిమా మహేష్ బాబు SSMB29 అని అందరికీ తెలిసిన విషయమే. మహేష్ బాబు సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి స్టోరీ ఇదేనంటూ ప్రచారాలు జరిగాయి.

అయితే ఈ ప్రచారాలు అన్నిటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో చెప్పటం జరిగింది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడుతూ. “నాకు ఎప్పటి నుంచో జేమ్స్ బాండ్ అలాగే అడ్వెంచర్ మూవీస్ తీయాలి అనే కోరిక ఉండిపోయిందని ఇప్పుడు మహేష్ బాబు తో అలాంటి సినిమానే తీసుకున్నానని వెల్లడించారు”.

Rajamouli talk about Mahesh Babu SSMB29 story line
Rajamouli talk about Mahesh Babu SSMB29 story line

తన తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారని ఇంటరాక్షన్‌లో తెలిపారు. రాజమౌళి తన తండ్రితో పాటు తన కజిన్‌తో కలిసి రెండు నెలల నుండి కథను డెవలప్ చేస్తున్నామని కూడా చెప్పారు. మహేష్ బాబుతో తాను గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రమ్ తీస్తున్నట్టు సమాధానం చెప్పడం జరిగింది.

రాజమౌళి చాలా సందర్భాల్లోనూ మహేష్ బాబుతో సినిమా తీస్తే, అది జేమ్స్ బాండ్ సినిమా తరహాలోనే ఉంటుందని చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు అదే స్టోరీ తో మహేష్ బాబు తో సినిమా ని ప్రారంభించారు రాజమౌళి. ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Related Articles

Telugu Articles

Movie Articles