Rajamouli Signs Irish Actress Alison Doody For RRR
Rajamouli Signs Irish Actress Alison Doody For RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న చిత్రం ‘RRR’. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు సంబంధించి వస్తున్న తాజా అప్‌డేట్స్ ఫ్యాన్స్‌‌లో ఎగ్జైట్‌మెంట్‌ని పెంచేస్తున్నాయి. ఈరోజు సినిమాలో తారక్‌కు జోడీగా నటించేబోయే అమ్మాయిని, విలన్‌ను ప్రకటించబోతున్నారు. దర్శకుడు రాజమౌళి చిత్ర కథకు సంబందించిన కొంత సమాచారం, కొందరు నటీనటుల గురించి తప్ప రాజమౌళి ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. కానీ ఈరోజు సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్, విలన్ల వివరాలను బయటపెట్టారు.

ఐర్లాండ్‌కు చెందిన నటి ఆలిసన్ డూడీని సినిమాలో విలన్ గా తీసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన నటి ఆలిసన్ డూడీని సినిమాలో విలన్ గా తీసుకున్నారు. ఈ 53 ఏళ్ల హాట్ బ్యూటీ ‘ఇండియానా జోన్స్’, ‘ది లాస్ట్ క్రుసేడ్’, ‘కింగ్ సోలోమాన్స్ మైన్స్’వంటి ఎన్నో బ్లాక్స్ బస్టర్ చిత్రాల్లో నటించారు.ఆమైతే సినిమాలో విలన్‌గా సరిపోతారని భావించిన రాజమౌళి తనను పిలిపించి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా చేసారంట.. ఆలిసన్ స్క్రీన్ ప్రెసెన్స్‌ రాజమౌళికి చాలా నచ్చిందట. ఆమెతో పాటు ఐర్లాండ్‌కు చెందిన రేమండ్ స్టీవెన్సన్ అనే మరో నటుడ్ని విలన్‌గా సెట్ చేసాడు..

Also Read: RRR అఫీషియల్ అప్డేట్..తారక్ కోసం ఒలీవియా మోరిస్..

1920 కాలంలో బ్రిటిష్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఎన్టీఆర్ కొమరం భీం, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..