RRR Movie జార్జియా షెడ్యూల్ డేట్ ఫిక్స్..!

0
522
RRR Team Georgia shoot date locked

RRR Movie Songs: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియన్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను పిక్చరైజ్ చేయాల్సి ఉంది. ఈ భారీ మల్టీస్టారర్ మూవీని 450 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ‘Roar Of RRR’ పేరుతో ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమా మీద ఊహకందని అంచనాలను పెంచారు.

అందుతున్న సమాచారం ప్రకారం, ఒక పాటను రామ్ చరణ్, అలియా భట్ ల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో చిత్రీకరిస్తారు. అలాగే మరో సాంగ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మీద ఉండే ఇంట్రడక్షన్ సాంగ్ ను జార్జియాలో చిత్రీకరిస్తారు. RRR టీమ్ ఈ సాంగ్ షూట్ కోసం ఈ నెల 29న జార్జియా వెళ్లనుంది అని టాక్. అక్కడే రెండు వారాల పాటు సాంగ్ ను షూట్ చేస్తారు అంట.

‘RRR’ కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ ని సిద్దం చేస్తున్నారని తాజాగా టాక్ మొదలైంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్స్ గా తెరకెక్కుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.