Bigg Boss Telugu 6 This week elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఇప్పుడు చివరకు చేరుకుంది. గత సీజన్ లాగానే ఇది గూడా అత్యంత ప్రజాదరణ పొందింది. బిగ్ బాస్ తెలుగు 6 ఇప్పుడు 12వ వారానికి చేరుకుంది. ఈవారం ఎలిమినేషన్ లో తొమ్మిది మంది ఉండగా వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Bigg Boss Telugu 6 This week elimination: ఈ రోజు విడుదలైన ఎపిసోడ్ ఆధారంగా, బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేషన్ శ్రీ సత్య అలాగే రాజ్ మధ్య ఓటింగ్ స్వల్ప తేడాతో ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పటిలాగానే బిగ్ బాస్ ప్రతి వారం ఎలిమినేషన్ క్యాండిడేట్స్ లీక్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వారం రాజ్ ఎలిమినేట్ అవుతాడని సమాచారం తెలుస్తుంది.
ఈ న్యూస్ విన్నవారంతా షాక్ అవ్వడం ఖాయం ఎందుకంటే. బిగ్ బాస్ విన్నర్ గ లేదా టాప్ 5లో ఉంటారు అనుకున్న వాళ్ళంతా ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో రాజ్ మొదటినుంచి సైలెంట్ గానే ఉన్నాడు. అయితే అవసరమైన టైమ్ లో మాత్రం తన తెలివిని ఉపయోగించి మాట్లాడటంలో కూడా మంచి మార్కులు కొట్టేశాడు. గత వారంలో కూడా నాగార్జున కూడా రాజ్ ని మెచ్చుకోవటం మనం చూస్తాం.
అయితే ఈ వారం రాజ్ ఎలిమినేట్ రావటం అందరికీ ఆశ్చర్యం కలగచేస్తుంది. ఇదే గనుక నిజమైతే ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా హౌసుని వీడిన ఓ మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంటాడు.