Rajasekhar Kalki Telugu Movie Review & Rating

విడుదల తేదీ : జూన్ 28, 2019
రేటింగ్ : 2.75/5
నటీనటులు : రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : సి.కళ్యాణ్
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : దాశరథి శివేంద్ర
ఎడిటర్ : గౌతమ్ నెరుసు

[INSERT_ELEMENTOR id=”3574″]

కల్కి…రాజశేఖర్ నటించిన ఈ సినిమాపై మామూలుగా అయితే పెద్దగా అంచనాలు ఉండేవి కావు.కానీ గరుడవేగ సినిమాతో స్టైలిష్ హిట్ అందుకుని రాజశేఖర్ ఫామ్ లోకి రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.అలాగే ఆ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించడం వల్ల ఆ హైప్ మరింతగా పెరిగింది.కల్కి ట్రైలర్స్ చాలా రిచ్ గా అనిపించాయి.సినిమాలో బలమయిన కంటెంట్ ఉంది అనిపించాయి.మరి ఆ అంచనాలను కల్కి ఏ మేరకు అందుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం.

కల్కి ట్రైలర్స్ చూస్తే భారీ కథ ఎదో ఉంది అనిపిస్తుంది.పైగా ఇన్వెస్టిగేషన్ స్టార్స్ అని వెయ్యడంతో ఊహించని మలుపులతో,సూపర్ బ్రెయిన్ గేమ్ తో కల్కి సినిమా సాగుతుంది అనిపిస్తుంది.అయితే ఈ సినిమా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ తో మొదలవుతుంది.హీరో కథలోకి ఎంటర్ అవ్వడానికి కాస్త టైం పట్టినా ఎదో ఉంది అనే క్యూరియస్ ఫ్యాక్టర్ తో సినిమా నడించింది.కానీ అక్కడినుండి ఎదో జరిగిపోతుంది,ఎదో జరిగిపోతుంది అనిపిస్తుంది తప్ప సినిమా ముందుకు కదలదు.సినిమా మొత్తానికి కీలకమైన మర్డర్ మిస్టరీ ఛేదించడానికి వచ్చిన కల్కి కి ఏ దశలో కూడా బ్రెయిన్ గేమ్ పరంగా కానీ,ఫిజికల్ గా గానీ పోటీ ఇవ్వలేకపోతాడు ప్రతినాయకుడు.దీంతో రాను రాను సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది.ఇక రాజశేఖర్,ఆదా శర్మల లవ్ ట్రాక్ సినిమాకి చాలా పెద్ద మైనస్.ఆ లవ్ ట్రాక్ వల్ల లెంగ్త్ పెరిగి సినిమా డ్రై గా తయారయింది.కల్కి స్టోరీ లైన్ చాలా థిన్ అనిచెప్పుకోవాలి.మర్డర్ మిస్టరీ చుట్టూ రెండు ట్విస్టులతో అల్లుకున్న కథ ఇది.దీనిలోకి చాలా సబ్ ప్లాట్స్ తీసుకువచ్చారు.కానీ ఏ ఒక్క సబ్ ప్లాట్ కూడా సినిమాకి పెద్దగా ఉపయోగపడింది లేదు.హీరో ఎలివేషన్ ఎక్కువ అయ్యింది.ఒక దశలో అయితే ఆ హై స్పీడ్ షాట్స్ మీద విరక్తి కలుగుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఈ కథకి రాజశేఖర్ ఎంత చేయగలడో అంత చేసాడు.అంతకుమించి చెయ్యడానికి కూడా ఏమీ లేదు అనిపిస్తుంది.గరుడవేగ లో లుక్ పరంగా కూడా చార్మింగ్ గా ఉన్న రాజశేఖర్ ఈ సినిమాలో మాత్రం ఏజ్ ఫ్యాక్టర్ ని మ్యానేజ్ చెయ్యలేకపోయాడు.చాలా చోట్ల వయసుమళ్ళిన విషయం తెలుస్తూ ఉంటుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ అయిన ఆదాశర్మ కూడా ఎలాంటి ప్రత్యేకత లేని పాత్రలో నార్మల్ గా నటించింది.ఈ మధ్య తనలోని నటికి ఏ మాత్రం ఛాలెంజ్ విసరలేని పాత్రలు ఒప్పుకుంటున్న నందితా శ్వేతా ఈ సినిమాలో మాత్రం ఒక మోస్తరుగా ఆకట్టుకుంది.విలన్ గా అశుతోష్ రానా గెట్ అండ్ సెట్ అప్ బావున్నా అతని విలనిజాన్ని ఎలివేట్ చేసే సరయిన సీన్స్ పడకపోవడంతో ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ పెద్దగా తెలియలేదు.ఇక సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉన్న రాహుల్ రామకృష్ణ పాత్ర బాగానే ఆకట్టుకుంది.సినిమాలో అతని కామెడీ రిలీఫ్ గా అనిపిస్తుంది.శత్రు,నాసర్,సిద్దు,పూజిత పొన్నాడ,జయప్రకాశ్ లాంటి నటీనటులు ఉన్నా సినిమా మొత్తం హీరోయిజం తో నిండిపోవడంతో మిగతావాళ్లకు పెద్దగా పెర్ఫార్మ్ చేసే అవకాశం లేకుండా పోయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

తన మొదటి సినిమా అ! లో క్లయిమాక్స్ ట్విస్ట్ తో ఆకట్టుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని స్టైలిష్ గా తియ్యాలని కంకణం కట్టుకున్నట్టు కనిపించాడు.ఫైట్స్ లో మాత్రమే కాదు మామూలు సీన్స్ లో కూడా హై స్పీడ్ షాట్స్ వాడాడు.దానికి తోడు ఇలాంటి థ్రిల్లర్ తరహా సినిమాకి కావాల్సిన నెయిల్ బైటింగ్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడా లేదు.ప్రీ క్లైమాక్,క్లైమాక్ ట్విస్టులు,వాటిని రివీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది.కంటెంట్ పరంగా వీక్ గా ఉన్న ఈ సినిమా టెక్నికల్ గా మాత్రం చాలా హై స్టాండర్డ్స్ లో ఉంది.దానికి కారణం సినిమాటోగ్రఫీ అండ్ ఆర్.ఆర్ అని చెప్పుకోవాలి.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ కష్టం సినిమలో అడుగడుగునా కనిపిస్తుంది.మూడ్ కి తగ్గట్టుగా వాడిన లైటింగ్ పాట్రన్స్ ఆకట్టుకుంటాయి.ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ పాటలపరంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.నిజానికి ఈ కథలో ఎక్కడ కూడా పాటలకు స్కోప్ లేదు.అయినా బలవంతంగా ఇరికించారు.అయితే ఆర్.ఆర్ మాత్రం ఆకట్టుకుంటుంది.హీరో ఎలివేషన్ సీన్స్ లో కొన్ని కొన్ని చోట్ల లౌడ్ గా అనిపిస్తుంది కూడా.ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది.నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు.సినిమాకి అవసరం లేకపోయినా రిచ్ నెస్ కోసం కులుమనాలి ఎపిసోడ్ పెట్టారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఫైనల్ గా చూస్తే ట్రైలర్స్ లో ఉన్నత ఇంప్రెసివ్ కంటెంట్ సినిమాలో లేకపోయినా,హీరో ఎలివేషన్స్ ఇబ్బందిపెట్టినా కమర్షియాలిటీ వల్ల ఈ సినిమా బి,సి సెంటర్స్ లో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.గరుడవేగ ఎఫెక్ట్ తో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సేఫ్ అవ్వొచ్చు.

 

[INSERT_ELEMENTOR id=”3574″]