రాజశేఖర్ ‘శేఖర్’ ఫస్ట్ లుక్

0
407
rajasekhar-new-movie-sekhar-first-look-released
rajasekhar-new-movie-sekhar-first-look-released

టాలీవుడ్ సీనియర్ నటుల్లో రాజశేఖర్ ఒకరు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు, పవర్ ఫుల్ పాత్రలతో అందరినీ ఆకట్టుకున్నారు. కాని గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా రాజశేఖర్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమాకు ఇంకా  పేరు పెట్టలేదు. ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు నీలకంఠ డైరెక్షన్‌లో ఎమ్‌ఎల్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

 

 

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దర్శకుడు నీలకంఠ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం డైరెక్టర్‌ను వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పేరుపై అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘శేఖర్’ అనే పేరును ఖరారు చేసారు , అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఈ రోజు ఉదయం 10గంటలకు విడుదల చేసారు.

Previous article‘ఉప్పెన’ సినిమాకి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారట.
Next article”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ పోస్టర్