(rajinikanth darbar first day box office collection) రజనీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమా ఈ రోజు థియేటర్ లో అడుగు పెట్టి సంచలనం సృష్టిస్తోంది. మొట్టమొదటి రోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా మొదలు అవ్వగా మార్నింగ్ షోల సమయానికి సినిమా పుంజుకోవడం మొదలు పెట్టింది, తర్వాత జోరు తగ్గకుండా చూసుకుంటూ గ్రోత్ ని సాధిస్తూ మంచి ఓపెనింగ్స్ దిశగా అడుగులు వేస్తుంది దర్బార్ సినిమా.
ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఎంతవరకు కలక్ట్ చేస్తుంది అనేది ప్రశ్న .. దాదాపుగా 120 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంది . . ఈ సినిమాకి టాక్ పెద్దగా పాజిటివ్గా ఏమీ అనిపించడం లేదు . ఎందుకంటే డైరెక్టర్ మురుగదాస్ సెకండాఫ్లో సినిమాని పూర్తిగా నేరంలో ముంచెత్తాడు, అవసరం లేనటువంటి సీన్లు అన్ని పెట్టేసి ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసాడు అని చూసినటువంటి ప్రతి ఒక్కరు చెబుతున్నారు . మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి మంచి గ్రోత్ ని సాధించగా ఇప్పుడు లెక్క 3 కోట్ల నుండి మొదలు అవుతుంది అని చెప్పాలి. సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి పూర్తీ ఆఫ్ లైన్ లెక్కలు అనుకున్న విధంగా ఉంటె. బాక్స్ ఆఫీస్ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3.6 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, దర్బార్ ప్రపంచ వ్యాప్తంగా ఒక 45 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కనెక్ట్ చేయొచ్చు అంటున్నారు అభిమానులు. రజనీకాంత్ గత చిత్రం 2.0 కూడా ఇలాగే బాగానే కలెక్ట్ చేసి ఫస్ట్ డే 48 కోట్లు వరల్డ్ వైడ్ షేర్ కొట్టింది .
అదే బాటలో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అనే ఫీలింగ్ ఫాన్స్ కి ఉంది.. అయితే పేలవంగా ఉన్నటువంటి సెకండాఫ్ ఈ సినిమాకి అతి పెద్ద తలనొప్పిగా మారింది . ఓన్లీ తెలుగులోనే ఈ సినిమాని 20 కోట్లకు అమ్మారు . మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ 52 కోట్లు షేర్ వచ్చింది అంటున్నారు. మరి రజినీ మురగదాస్ ల దర్బార్ మొదటి రోజు అఫీషియల్ గా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం.
‘దర్బార్’ తెలుగు రాష్ట్రాల మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :