(rajinikanth Darbar movie day 1 box office collection) సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ చిత్రంతో అదరగొడుతున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. గతంలో వచ్చిన ‘కాలా’ ‘పేట’ సినిమాలు ట్రైలర్లు సినిమాలపై అమాంతం అంచనాలు పెంచాయి. కానీ ట్రైలర్స్ ఉన్నంత స్థాయిలో సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. అందుకే ఈ సారి డైరెక్టర్ మురగదాస్ దర్బార్ రజనీ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించాడు. మురుగదాస్ ప్రతీ సినిమాలోనూ మంచి కాన్సెప్ట్ ఉంటుంది.. అయితే ‘దర్బార్’ సినిమాలో పూర్తిగా రజినీ ఫ్యాన్ బేస్ మీదే ఆధారపడిపోయాడు. ఫస్ట్ హాఫ్ మంచి ఎంగేజింగ్ గా తెరకెక్కించిన మురుగదాస్… సెకండ్ హాఫ్ ను అంత రసవత్తరంగా నడపలేకపోయాడు.ఈ క్రమంలో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లను మాత్రమే ‘దర్బార్’ రాబట్టింది.
వింటేజ్ లుక్‌లో రజనీ లుక్స్, మేనరిజమ్స్ సాధారణ ఆడియెన్స్‌ను సైతం సర్ప్రైజ్ చేశాయి. అక్కడక్కడ నెగటీవ్ కామెంట్స్ వినిపించినా..మొత్తానికి బొమ్మ ఈ పొంగల్ రేస్ తొలి బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇక రజనీ సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా..? ‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 4.52 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 10 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘దర్బార్’ 4.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టడం గమనార్హం. బాక్సాఫీస్ దగ్గర సింహనాదం చేస్తున్నాడు తలైవా. పోటీగా ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో సౌత్ అంతా సాలిడ్ ప్రదర్శన ఇస్తున్నాడు.
నైజాం | 2.10 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 0.44 cr |
ఈస్ట్ | 0.28 cr |
వెస్ట్ | 0.18 cr |
కృష్ణా | 0.24 cr |
గుంటూరు | 0.40 cr |
నెల్లూరు | 0.18 cr |
ఏపీ + తెలంగాణ | 4.52 cr(share) |