Homeసినిమా వార్తలుమొయిద్దీన్ భాయ్ గా అదరగొడుతున్న రజినీకాంత్ ఫస్ట్ లుక్..!!

మొయిద్దీన్ భాయ్ గా అదరగొడుతున్న రజినీకాంత్ ఫస్ట్ లుక్..!!

Rajinikanth First Look Poster From Lalsalam Movie, Make way for Rajnikanth as Moideen Bhai from Lalsalam Movie, Lalsalam movie release date, Shooting update

Rajinikanth First Look Poster From Lalsalam: ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్ తోనే కాకుండా డిఫరెంట్ స్టైల్ తో ప్రేక్షకులను అబ్బురపరుస్తూ నేటికీ స్టార్ హీరో స్టేటస్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉన్న నటుడు రజినీకాంత్. అలాగే భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ తోపాటు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన భారీ పాన్ ఇండియన్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

First look poster of Rajinikanth from Lal Salaam: ఇక ఇప్పుడు వీరి నిర్మాణ సారధ్యంలో రానున్న మరో భారీ చిత్రం లాల్ సలాం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వ బాధ్యత వహిస్తున్నారు. విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంతో జరుగుతుంది. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్.. లాల్ సలాం మూవీ లో పోషిస్తున్న క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

‘మొయిద్దీన్ భాయ్’ (Moideen Bhai) క్యారెక్టర్‌ లో రజనీకాంత్ (Rajinikanth) లుక్ చాలా రాయల్ గా ఉంది. ఇటు మాస్ అటు క్లాస్ రెండు ఒకే లుక్ లో కనిపించే విధంగా ఉండడం ఒక్క రజనీకాంత్ కే దక్కుతుంది. అప్పుడెప్పుడో భాష సినిమాలో మాణిక్ భాషాగా కనిపించిన రజనీకాంత్ తిరిగి ఇన్నాళ్లకు లాల్ సలాం లో మొయినుద్దీన్ భాయ్ గా కనిపించనున్నారు.

ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు “డిఫరెంట్ గా ఉండే చిత్రాలను అందించడానికి తమ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న లాల్ సలాం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ను మొయిద్దీన్ బాయ్ అనే పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారని. ఆయనకు సంబంధించిన పవర్ఫుల్ లుక్ పోస్టర్ విడుదల చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని…. ఎప్పటిలాగానే ఆయన రాకింగ్ పర్ఫామెన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదని తెలిపారు.

Rajinikanth First Look Poster From Lalsalam Movie '

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో రజనీకాంత్ కుర్తా ధరించి ఎర్రని క్యాప్ మరియు బ్లాక్ గాగుల్స్ …నెరిసిన గడ్డంతో ఎంతో స్టైలిష్ గా ఉన్నారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర అల్లర్లు జరుగుతున్నట్లుగా పోస్టల్ వెనక బ్యాక్ గ్రౌండ్ ఉంది…వాటి మధ్య నుంచి రజనీకాంత్ స్టైలిష్ గా నడుచుకుంటూ బయటికి వస్తున్నారు. ఒక్క పోస్టర్ తోటే చిత్రంలో తన పాత్ర ఎంత పవర్ఫుల్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు మూవీ మేకర్స్. చూడబోతే ఈ చిత్రంలో ఓ డాన్ తరహా పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నట్లు అర్థం అవుతుంది. ప్రస్తుతం రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మోస్ట్ ట్రైనింగ్ గా మారింది.

- Advertisement -

Web Title: Rajinikanth First Look Poster From Lalsalam Movie, Make way for Rajnikanth as Moideen Bhai from Lalsalam Movie, Lalsalam movie release date, Shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY