తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్న సినిమా జైలర్. ఈ సినిమాని వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అలాగే సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనాలు క్రియేట్ చేసేలాగా తయారు చేశారు. కానీ రజినీకాంత్ కి ఉన్న స్టార్ డం ని బాక్సాఫీస్ వద్ద విజయాలు సొంతం చేసుకోవటంలో విఫలమవుతున్నారు దర్శకులు. కొన్ని సంవత్సరాలుగా రజినీకాంత్ కి కమర్షియల్ హిట్ అనేది లేకపోయినప్పటికీ తన ఫాన్స్ మాత్రం కొత్త సినిమాల గురించి ఎదురు చూస్తూనే ఉన్నారు.
భారీ అంచనాలు పెంచిన జైలర్ మూవీ స్టోరీ గురించి అలాగే రజినీకాంత్ ఎటువంటి పాత్ర నటించబోతున్నారని విషయం గురించి తెలుసుకోవటానికి ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు జైలర్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్ రోల్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం జైలర్ స్టోరీ వచ్చేటప్పటికి.. జైలర్ సినిమాలో ఆరు ఏళ్ల బాబుకు తాతగా రజినీకాంత్ కనిపించబోతున్నాడు. కథ విషయానికి వస్తే… రజినీకాంత్ ఒక రిటైర్డ్ జైలర్. ఆయన తనయుడు అసిస్టెంట్ కమీషనర్. ఒక కేసు విచారణ సమయంలో రజినీకాంత్ తనయుడు కనిపించకుండా పోతాడు. దాంతో రంగంలోకి దిగిన మాజీ జైలర్ తన కొడుకును ఎలా కాపాడుకుంటాడు… ఆ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు అనేది కథ.

జైలర్ సినిమా స్టోరీ మీద అలాగే రజినీకాంత్ పాత్ర మీద క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాతో అయినా రజనీకాంత్ భారీ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద జైలర్ మూవీ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.