కొత్త పార్టీ ప్రకటనకు డేట్ ఫిక్స్ చేసేసిన రజినీకాంత్ ..!

0
312
Rajinikanth political party announcement on December 31

రజినీ మక్కల్ మండ్రమ్ రాజకీయ పార్టీగా రూపుదాల్చబోతుందన్నది స్పష్టమైపోయింది. తన బాక్సాఫీస్ స్టామినాతో తనదైన హీరోయిజం తో ప్రపంచాన్ని ఇండియన్ సినిమా వైపు ఎప్పుడో తిప్పిన రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తమిళ రజిని ఫాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి అయితే అందరి చూపులు రజిని వైపే ఉన్నాయి.అలాగే ఆ మధ్య సంకేతాలు ఇచ్చి అసలు పార్టీ పెడుతున్నారా లేదా అన్న విషయంపై మాత్రం సస్పెన్స్ ను ఉంచేశారు. దీనితో తమిళ నాట ఒకరకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

మూడు రోజుల క్రితం రజినీ కాంత్ రజినీ మక్కల్ మండ్రమ్ జిల్లా కార్యదర్శులందరితోనూ భేటీ కావడంతోనే కొంత స్పష్టత వచ్చేసింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా తమిళనాడుకు రావడంతోనే ఇక్కడ రాజకీయ చైతన్యం మొదలైంది. ఇంతకీ తన కొత్త పార్టీను ఎపుడు ప్రకటించనున్నారంటే ఈ ఏడాది ముగింపు డిసెంబర్ 31న తన కొత్త పార్టీకు అధికారికంగా ప్రకటించి.. కొత్త సంవత్సరం ఆరంభంతో పురుడు పోయనున్నారు.

ఈ ప్రకటన కోసమే ఎంతో కాలం నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మాత్రం తలైవర్ ఆ భారీ ప్రకటనను ఫైనల్ చేసేసారు. తాజా వార్త ఏమిటంటే జైలులో ఉన్న శశికళ జనవరి 27న విడుదల కాబోతున్నారు.ఓ పక్క రజినీ రాజకీయ బరిలోకి దూకడం, ఇంకో పక్క శశికళ విడుదల కానుండటం తమిళనాట రాజకీయం రసకందాయానికి చేరుకుంది. కొత్త సంవత్సరం నుంచి తమిళనాడులో కొత్త రాజకీయ ఉత్సాహం కనిపించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here