ఇద్దరు హెరొఇనెస్ తో మాస్ మహారాజా ఆటపాట..!

RT68: Ramarao On Duty Heroines: మాస్‌ మహారాజ్‌ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజీషా విజయన్‌ (Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తున్నారని చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు వీళ్లిద్దర్నీ తమ టీమ్‌లోకి ఆహ్వానిస్తూ చిత్రనిర్మాణ సంస్థ ట్వీట్‌ పెట్టింది.

ఈ సినిమాతోనే రాజీషా విజయన్‌ తెలుగు చిత్రసీమకు పరిచయం కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ప్రభుత్వ అధికారిగా రవితేజ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కథానాయికల పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రవితేజతో పాటు దివ్యాంశ కౌశిక్‌, రాజీషాలపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం’ అని తెలిపారు.

Rajisha Vijayan and Divyansha Kaushik romance with Ravi Teja next Ramarao On Duty

మరోవైపు, నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘మజిలీ’ చిత్రంతో దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమ్యారు. మలయాళంలో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా అక్కడ మంచి మార్కులు కొట్టేశారు నటి రాజీషా. నాజర్‌, వీకే నరేష్‌ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్‌ సీఎస్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles