Homeట్రెండింగ్డగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రకుల్

డగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రకుల్

Rakul Preet Singh Drug Case: తన లాయర్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో మీడియా విచారణకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు రకుల్ ప్రీత్ సింగ్. డ్రగ్స్ కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని రకుల్‌ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన రియా చక్రవర్తి పలువురు బాలీవుడ్ నటీనటుల పేర్లు వెల్లడించినట్లు ఇటీవల ఎన్సీబీ అధికారికంగా ప్రకటించింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఉన్నాయని తెలిపింది. NCB డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ప్రకటన చేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

రకుల్‌ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేసేలా ఆదేశించాలంటూ పిటిషన్‌లో పేర్కొంది. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని రకుల్ న్యాయస్థానాన్ని కోరింది. మీడియా కథనాలు I & B మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం విచారణ చేపట్టింది.

మీడియాలో వచ్చే కథనాలపై సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోదని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వశాఖతో పాటు ప్రసార భారతికి, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌, ప్రెస్ కౌన్సిల్‌కు నోటీసులు పంపింది. రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. వ్యక్తులపై కథనాలు ప్రసారం చేసేటప్పుడు స్వీయ నియంత్రణ పాటించాలని మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. రకుల్ వేసిన పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY