rakul preet singh arrives at ncb office in mumbai

drugs racket: Rakul Preet Singh: బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి సంచలన విషయాలను బయటపెట్టింది. పలువురు పేర్లను వెల్లడించడంతో వారందరినీ NCB విచారిస్తోంది. అందులో భాగంగా ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలోని ఎన్సీపీ సిట్ విచారణకు హాజరయింది. అయితే విచారణకు వెళ్తున్న క్రమంలో ఆమె కాస్త ఆదోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ రాకెట్ విచారణలో భాగంగా రకుల్‌పై ఎన్‌సీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది. రకుల్ ప్రీత్‌సింగ్ ముఖానికి మాస్క్ ధరించి విచారణకు హాజరైంది. రకుల్ వెంట ఆమె సోదరుడు ఉన్నట్లు తెలిస్తోంది. రియాతో మీకెలాంటి సంబంధాలున్నాయి?, రియా నుంచి డ్రగ్స్ తీసుకున్నారా?, సుశాంత్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలకు వెళ్ళారా? అంటూ రకుల్ నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌‌తో పాటు శ్రద్ధా కపూర్‌కు కూడా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా దీపికాతో పాటు విచారణకు తాను కూడా హాజరవుతానని ఆమె భర్త రణ్‌వీర్‌సింగ్ ఎన్‌సీబీని కోరాడు. దీపిక ఒక్కోసారి ఉద్వేగానికి గురవుతుందనే కారణం చూపుతూ ఈ అభ్యర్థన పెట్టాడు. కాగా హీరోయిన్ల విచారణ నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్ట్, ఎన్‌సీబీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించి భద్రత కల్పిస్తున్నారు.