మాల్దీవుల్లో రచ్చ లేపుతున్న రకుల్‌..!

0
435
Rakul Preet Singh Enjoying In Maldives With Bikini Pic Goes Viral

టాలీవుడ్ సినీతారలు వరుసగా మాల్దీవుల బాట పట్టారు. అయితే తాజాగా రకుల్ ప్రీత్.. ఒకవైపు టాలీవుడ్‌, మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా మాల్దీవుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి వెళ్లింది. అక్కడ సముద్రపు ఒడ్డున చల్లటి గాలి ఆస్వాదిస్తూ బికినీలో రచ్చ చేస్తోంది.ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన రకుల్.. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది.

సముద్రపు ఒడ్డున రిసార్టులో బికినీలో సేద తీరుతున్న ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫిట్‌నెస్‌లోకు అధిక ప్రాధాన్యమిచ్చే రకుల్ గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గేది లేదని ఈ పిక్‌‌తో స్పష్టం చేసింది. బాలీవుడ్ హీరోయిన్ల కంటే ఎందులోనూ తాను తక్కువ కాదన్న రీతిలో ఫోటోకు ఫోజులిచ్చింది. ‘స్మెల్ ది సీ… ఫీల్ ది స్కై… లెట్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ ఫ్లై’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. తెలుగులో క్రిష్ డైరెక్షన్‌లో పంజా వైష్ణవ్ తేజ్ జోడీగా ఓ సినిమా చేస్తున్న రకుల్‌, బాలీవుడ్‌లో అర్జున్ కపూర్‌, జాన్ అబ్రహాం, అదితి రావ్ హైదరితో పాటు ఇంకా టైటిల్ ఖరారు చేయని ఓ క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీలో నటిస్తోంది.

ఈ సినిమాలతో పాటు తాజాగా అజయ్ దేవ్‌గణ్ డైరెక్ట్ చేయనున్న ‘మేడే’ మూవీలో ఆయన సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. ‘మేడే’లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్‌‌గా రకుల్ పేరుని పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కొంతకాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న రకుల్ ఇప్పుడు బిజీగా మారుతోంది.

Previous articleAllu Arjun’s shooting pic from ‘Pushpa’ set gets leaked
Next articleబన్నీ మాస్టర్‌ ప్లాన్ బాలీవుడ్‌ను “ఢీ” కొట్టేందుకు