rakul preet singh special poster released from nithiin check

Rakul Preet Check Movie First look:  నేడు (అక్టోబర్ 10) అందాల భామ, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హ్యాపీ బర్త్ డే రకుల్ అంటూ ఆమె లేటెస్ట్ మూవీ ‘చెక్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ఆ సినిమా యూనిట్. ఈ కొత్త పోస్టర్ లో రకుల్ చాలా కొత్తగా కనిపిస్తోంది. అంతేకాకుండా చాలా సీరియస్‌గా కనిపిస్తుంది. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని ఉంది. చూస్తుంటే అమెది సినిమాలో కీలకమైన పాత్రేనని తెలుస్తోంది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ చెక్ మూవీ రూపొందుతోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ప్రీలుక్‌ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. చదరంగం నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంలో థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోందట చెక్ యూనిట్.

Rakul Preet Singh first look Poster Released From Nithiin Check movie

ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు చివరి షెడ్యూల్ పూర్తిచేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు చిత్ర దర్శకనిర్మాతలు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న హలో సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.