కరోనా కారణంగా చాలా రోజులుగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. అయితే కొందరు మాత్రం ధైర్యం చేసి బయటికి వచ్చేసారు. అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కూడా ఉంది. క్రిష్ (Krish) దర్శకత్వంలో ఈమె ఓ సినిమా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో (Vaishnav Tej ) వికారాబాద్ అడవుల్లో ఆడిపాడుతోందట.
క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం విమానాశ్రయం దిగగానే నేరుగా వికారాబాద్ వెళ్లిందట రకుల్. అక్కడే సీక్రెట్‌గా క్రిష్ తన సినిమా షూటింగ్ చేస్తున్నారట. దాదాపు వారం రోజుల పాటు ఈ షూట్ ఉండొచ్చని తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో. ఈయన తొలి సినిమా ఉప్పెన ఇంకా విడుదల కాకముందే అప్పుడే రెండో సినిమా చేస్తున్నాడు ఈయన. అది కూడా క్రిష్ లాంటి దర్శకుడితో.సెప్టెంబర్ 1 నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. హీరో హీరోయిన్లు ఇద్దరూ షూట్లో పాల్గొన్నారని తెలుస్తుంది.
ఇందులో రకుల్ గ్లామర్ రోల్ పోషిస్తోందని టాక్. ఇకపోతే డైరెక్టర్ క్రిష్.. తన తదుపరి సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్స్ లేకపోవడంతో ఆ గ్యాప్ ఫిల్ చేస్తూ ఇంతలో వైష్ణవ్ తేజ్- రకుల్ వెబ్ సిరీస్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసిన క్రిష్ దాన్ని ఇలా అమలు చేస్తున్నారని సమాచారం.