rakul preet singh left vikarabad shooting spot after her name comes out in drugs case

Rakul Preet Singh Drug Case: రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యహారంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి ఆమె పేరును పోలీసుల ముందు చెప్పారని వార్తలు రావడంతో అందరి కళ్లూ రకుల్‌పై పడ్డాయి. సుశాంత్ రాజ్‌పుత్‌‌ మ‌రణం కార‌ణంగా కొన్నిరోజుల నుంచి కేసులు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో రియా చ‌క్ర‌వ‌ర్తి ఎన్‌సీబీ అధికారుల‌కు మొత్తం 25 పేర్లు వెల్ల‌డించింది. వారిలో టాలీవుడ్ అందాలా బామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ పేర్లు ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది కాగా.. ప్ర‌స్తుతం ర‌కుల్ సినిమా షూటింగ్ కోసం మూడు రోజుల ముందు హైద‌రాబాద్‌కు వ‌చ్చింది.

శనివారం ఉదయం ఆమె షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే, ఆమె షూటింగ్‌లో ఉండగానే డ్రగ్స్ కేసులో తన పేరు కూడా ఉన్నట్టు తెలిసింది. అంతేకాకుండా, మీడియాలో వస్తోన్న వార్తలతో కలత చెందిన రకుల్.. అర్ధాంతరంగా షూటింగ్ నుంచి హైదరాబాద్ వచ్చేశారని సమాచారం. ప్రస్తుతం ఆమె జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నారు.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌తో కలిసి రకుల్ నటిస్తున్నారు. వికారాబాద్ ఫారెస్ట్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకే ఒక్క షెడ్యూల్‌లో కేవలం 40 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వీడియోలో ర‌కుల్ పళ్లెటూరి అమ్మాయి గెట‌ప్‌లో గొర్రెల కాప‌రిగా క‌నిపిస్తుంది. రియా వెల్లడించిన యాక్టర్లందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. సుశాంత్ కేసు ఇంకెన్ని విధాలుగా మ‌లుపు తిరుగుతుందో చూడాలి.