rakul preet singh rejects vijay devarakonda geetha govindam movie
rakul preet singh rejects vijay devarakonda geetha govindam movie

రకుల్ ప్రీత్ సింగ్… అనూహ్యంగా స్టార్ హీరోయిన్ అయ్యింది. అంతే తొందరగా ఆ స్టార్ డం పోగొట్టుకుంది కూడా. రాబోయే అదృష్టాన్ని అంచనా వేయలేక పోతే అందుకు తగ్గ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో.. రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ఫలితంగా మంచి సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా కోల్పోయింది. అలానే తనని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని క్యాచ్ చేయలేక వదులుకుంది రకుల్. బ్లాక్ బస్టర్ ఛాన్సుని పసిగట్టలేక అతిగా ఆలోచించి మంచి అవకాశాన్ని చేజేతులా వదులుకుందట.

ఆమెకు ప్రస్తుతం హిట్లు లేవు.. బాలీవుడ్ లో రాణించాలని తెగ ప్రయత్నిస్తుంది కానీ అవకాశాలు రావాడం లేదు. ఇంతకీ ఏమా అరుదైన అవకాశం? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవల ఆమె తెలిపిన ఓ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఈమె విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ చేసే అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందట. `గీత గోవిందం`లో విజయ్ కి జోడీ గా నటించే అవకాశం ముందు అను ఇమ్యాన్యుయేల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ని వరించిందట.కానీ కొత్త హీరోతో ఎందుకులే అని రిజెక్ట్ చేసిందట రకుల్. ఆ సినిమా రిలీజై స్టార్ హీరోల రేంజు ను మించి ఆడింది. సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రకుల్ బయటపెట్టేసింది.

సో అసలు కారణం పారితోషికం అని అర్ధం చేసుకోవచ్చు. ఏమైతేనేం ఆ చిత్రం రిజెక్ట్ చేయడం రకుల్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.! బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నలిచి వంద కోట్ల క్లబ్లో చేరిన `గీత గోవిందం` చిత్రాన్ని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు తెగ ఫీలవుతోందట రకుల్. అదృష్ణం తలుపు తట్టినప్పుడే చటుక్కున పట్టుకోవాలి.