రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌..!

0
396
Rakul Preet Singh tests positive for Covid-19

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ క‌రోనా బారిన ప‌డింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపింది. కోవిడ్‌-19 పాజిటివ్ గా తేలిందని ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేస్తున్నా. సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను. నేను క్షేమంగానే ఉన్నాను. నేను త్వ‌ర‌లో షూటింగ్‌లో జాయిన్ కావాల్సింది.ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది..అంటూ పోస్ట్ లో పేర్కొంది.

దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోగలరు. అందరు జాగ్రత్తగా ఉండండి’అంటూ రకుల్‌ విజ్ఞప్తి చేసింది. ఇటీవ‌లే ర‌కుల్ మాల్దీవులు వెకేష‌న్ టూర్ లో స‌ర‌దాగా ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్ తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు‌ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.

 

Previous articleమహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అప్డేట్
Next articleRakul Preet Singh tests coronavirus positive