Rakul Preet singh Upcoming tollywood bollywood movies 2020
Rakul Preet singh Upcoming tollywood bollywood movies 2020

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ మధ్య పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించకపోవడంతో ఆమె టైమ్ అయిపోయిందని అనుకున్నారు. చివరగా ఆమె తెలుగులో నటించిన చిత్రం మన్మధుడు-2.. ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగులోనే అనుకుంటే ఆమె హిందీలో నటించిన ‘మర్ జావా’ సినిమా కూడా అంతే పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. రివ్యూల్లో సినిమాని ఏకి పారేశారు. ఇప్పుడు రకుల్ సినిమాలో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయంటూ అనుకుంటున్నారు. అయితే ఈ అమ్మడి చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయంటే అసలు నమ్మరేమో.

తెలుగులో నితిన్, చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒకటి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో ఒక సినిమాను ఓకె చెప్పేసింది. కానీ బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే నిజంగానే అన్ని సినిమాల్లో రకుల్ నటిస్తోందా లేక.. ఊరికే హైప్ కోసం.. తాను ఖాళీగా లేను అని చెప్పుకోడానికే ఇలా వార్తలు స్ప్రెడ్ అయ్యేలా చేస్తోందా అన్నది తెలియాల్సి ఉంది. ఆ సినిమాలు పట్టాలెక్కేదాకా కూడా ఓ క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

ఇక ఇటీవల ఓ ఈవెంట్ లో రకుల్ మాట్లాడిన మాటలు మాత్రం చాలా మంచి గుర్తింపు తెచ్చాయి ఆమెకు. ఆమె ముఖ్యంగా చెడు స్పర్శకు.. మంచి స్పర్శకు మధ్య తేడా ఏంటో చిన్నతనంలోనే అమ్మాయిలకు అవగాహన కల్పించాలని వైజాగ్ లో జరిగిన ఈవెంట్ లో మాట్లాడింది. ఇప్పటి సమాజంలో అమ్మాయిలను అసభ్యకరమైన రీతిలో తాకేవాళ్లు ఎక్కువ అవుతున్నారని చెప్పింది రకుల్. అలా చేసేవాళ్లు ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లే అని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా అలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుకుంటోంది. నిజంగా ఎంతో ధైర్యంగా రకుల్ మాట్లాడడం అందరికీ నచ్చింది.