Homeట్రెండింగ్ఆస్కార్ కల సాకారమైన వేళ.. RRR హీరోల ఫ్యాన్ వార్..!

ఆస్కార్ కల సాకారమైన వేళ.. RRR హీరోల ఫ్యాన్ వార్..!

Ram Charan and Jr NTR fans fight on social media.. Ram Charan and Jr NTR upcoming movies. Fans war at social media about RRR Movie lead hero

Ram Charan – Jr NTR Fan war: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ – 2023 అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది మన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పురస్కారం అందుకొని చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు ఎన్నో ఏళ్ల నాటి కలనుసాకారం చేసిన రాజమౌళి అండ్ టీమ్ ని సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు. దేశానికే గర్వకారణమని కొనియాడుతున్నారు. అయితే RRR హీరోల ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలాగే సోషల్ మీడియా ఫైట్ చేసుకుంటున్నారు.

Ram Charan – Jr NTR Fan war: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోలను ఓకే స్క్రీన్ మీదకి తీసుకొచ్చి RRR చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమురం భీమ్ వంటి ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో కల్పిత కథతో ఈ సినిమాని రూపొందించారు.

Fan was between Jr NTR and Ram Charan
Fan was between Jr NTR and Ram Charan

ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచే తారక్ (NTR) – చరణ్ (Ram Charan) అభిమానుల మధ్య వార్ జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ జక్కన్న ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ సమానంగా మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారు. బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

అయితే RRR సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో.. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అదే స్థాయిలో సోషల్ మీడియా వార్ జరిగాయి. మా హీరో గొప్ప అంటే.. కాదు, మా హీరో గ్రేట్ అంటూ ఇరు వర్గాలు విమర్శలు ప్రతి విమర్శలతో.. ట్విట్టర్ లో రోజుకో హ్యష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తూ వచ్చారు. ఇక ట్రిపుల్ ఆర్ చిత్రానికి గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు దక్కిన తర్వాత, ఎన్టీఆర్ – రాంచరణ్ ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య పోరు ఇంకాస్త ఎక్కువ అయిందని చెప్పాలి.

RRR మూవీ గోల్డెన్ గ్లోబ్ తో సహా పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. అయితే ఇందులో మేజర్ క్రెడిట్ తమ హీరోకే దక్కాలంటూ చరణ్ – తారక్ ఫ్యాన్స్ నెట్టింట తరచుగా ఫైట్ చేసుకుంటూ వచ్చారు. చివరకు ఇప్పుడు ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డ్ అందుకొని చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

‘నాటు నాటు’ పాట అత్యున్నత అవార్డు అందుకున్న నేపథ్యంలో.. వరల్డ్ వైడ్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా పేరు మారుమోగిపోతోంది. అయితే ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. అవార్డు ప్రదానోత్సవం సమయంలో స్క్రీన్ పై భీమ్ ఫోటో మాత్రమే వేశారు కాబట్టి.. ఫేస్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ అంటూ తారక్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ అనౌన్స్ చేసేటప్పుడు నామినేషన్స్ లో రామరాజును మాత్రమే చూపించారని మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Fan was between Jr NTR and Ram Charan
Fan was between Jr NTR and Ram Charan
- Advertisement -

ఇలా నిన్నటి నుంచి ఇద్దరు RRR హీరోల అభిమానులు ట్రోల్ చేసుకుంటున్నారు. ఎవరు మెయిన్ హీరో అనేదితేలిపోయిందంటూ ఫ్యాన్ వార్స్ కి దిగుతున్నారు. నిజానికి ట్రిపుల్ ఆర్ సినిమాలో తారక్ – చరణ్ లకు సమ ప్రాధాన్యత ఉంది. ఎవరు పాత్రల్లో వారు అద్భుతంగా నటించారు.

నాటు నాటు పాటకు సరి సమానంగా స్టెప్పులు వేసి అలరించారు. వాళ్లిద్దరి మధ్య బ్రోమాన్స్ అంత బాగా కుదిరింది కాబట్టే, సినిమా అంత పెద్ద హిట్ అయింది.. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ ను కూడా తెచ్చిపెట్టింది. కాబట్టి, తెలుగు పాటకి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వచ్చిందని గర్వపడేలా కానీ.. నెట్టింట రచ్చ కెక్కడం ఏమాత్రం స్వాగతించదగ్గ విషయం కాదు. మరి ఇప్పటికైనా ఇరు వర్గాల అభిమానులు దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటారేమో చూడాలి.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY