RRR: చరణ్‌, తారక్‌ సరదా ముచ్చట్లు..!

0
48
Ram charan and Tarak crazy talk in between RRR movie shooting

RRR Movie: రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఎప్పుడు థియేటర్‌కు వెళ్లి ఈలలు వేసి గోల చేద్దామా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. RRR యూనిట్ ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ -తారక్ లపై ఒక ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. జార్జియాలోని పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ సమయంలో తన హీరోలతో జక్కన్న సరదాగా సమయం గడిపారు. చరణ్‌, తారక్‌ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ఉండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు కనిపించారు. ఈ వీడియోను ఆర్ఆర్‌ఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది.

సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి కీరవాణి రాజమౌళితో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.