Ram Charan Daughter Name: జూన్ 20న రామ్ చరణ్ అలాగే ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కి కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు దానితోపాటు చాలామంది సెలబ్రిటీస్ కూడా విషెస్ చేయటం జరిగింది. దాదాపు పెళ్లయిన 11 సంవత్సరాల కి కూతురు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి అలాగే సురేఖ ఎంతో ఆనందించారు. అప్పటినుంచి రామ్ చరణ్ తన కూతురుకి ఏం పేరు పెడతారా అంటూ సస్పెన్స్ అయితే ఉంది.
ఈరోజు రామ్ చరణ్ కుమార్తె (Ram Charan Daughter Namer) బారసాల చేస్తున్నట్టు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి న్యూస్ ని వైరల్ చేశారు. అలాగే ఇదే ఫంక్షన్ లో రామ్ చరణ్ కుమార్తె పేరు కూడా ప్రకటిస్తారని చెప్పటం జరిగింది. ఈ క్రమంలో అందరిలోనూ ఆసక్తి అనేది పెరిగింది దానితోపాటు కూతురుకి ఏం పేరు పెడతారా అని కూడా అందరూ ఎదురు చూశారు. సస్పెన్స్ కి తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కుమార్తె పేరుని ప్రకటించడం జరిగింది.
చరణ్ – ఉపాసన ల కూతురికి క్లిన్ కారా (Klin Kaara) అనే పేరుని నామకరణం చేసినట్టు చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఫ్యామిలీ ఫోటో ని అలాగే ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. ఇదే విషయాన్ని ఉపాసన కూడా తన ట్విట్టర్ ఎకౌంట్లో తెలియచేశారు.

చిరంజీవి విడుదల చేసిన ప్రెస్ నోట్ లో లలిత సహస్రనామం నుండి రామ్ చరణ్ కుమార్తె పేరుని తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. అలాగే ఈ పేరు పాజిటివ్ ఎనర్జీని అలాగే ఆధ్యాత్మికతను నింపేలా రామ్ చరణ్ అలాగే ఉపాసన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకు వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ కుమార్తెకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.