Ram Charan – Akhil Agent Movie: యూత్ కింగ్ అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఏజెంట్”. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో వస్తున్న మేకర్స్.. తాజాగా ‘ధృవ x ఏజెంట్’ అంటూ అందరిలో అంచనాలు పెంచేశారు.
Ram Charan – Akhil Agent Movie: ‘ఏజెంట్’ సినిమా నుంచి ఇప్పటి వరకూ విడుదలయిన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అగ్రెసివ్ ప్రమోట్ చేస్తున్న అఖిల్.. మూవీకి కావల్సినంత హైప్ తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు.
‘ధృవ x ఏజెంట్’.. థింగ్స్ మరింత వైల్డ్ గా మారబోతున్నాడు.. వేచి ఉండండి అంటూ అఖిల్ (Akhil) సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో ‘ధృవ’ చిత్రంలోని రామ్ చరణ్ (Ram Charan) బ్యాక్ సైడ్ లుక్ ని చూపిస్తూ.. ‘ఏజెంట్ ఎక్కడున్నావ్?’ అనే వాయిస్ ఓవర్ వినిపించారు. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిన ఈ గ్లిమ్స్.. చెర్రీ, అఖిల్ కలిసి ఏదో వైల్డ్ గా ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించింది.
రామ్ చరణ్ & సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ధృవ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో చెర్రీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా నటించాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ నుంచి రాబోతున్న ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ ఒక స్పైగా కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా బయటకు వచ్చిన వీడియోతో చరణ్, అఖిల్ లతో సూరి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ తరహాలోనే సూరి యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజంగానే సురేందర్ రెడ్డి యూనివర్స్ లో రామ్ చరణ్, అఖిల్ లను భాగం చేస్తున్నాడా? లేదా ఏజెంట్ మూవీ ప్రమోషన్స్ కోసం ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నారా? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా RRR తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన చరణ్ ఎంట్రీ అఖిల్ సినిమాకు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ వుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కాగా, ఏజెంట్ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
Stay tuned…. #Dhruva x #Agent. #AGENTonApril28th pic.twitter.com/QJOenBa3h2
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 26, 2023