సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి వరుస ప్రాజెక్ట్ తో పవర్ స్టార్ (Pawan Kalyan) ఫుల్ బిజీగా ఉన్నారు. ఫాన్స్ కోసం ఒకదాని తర్వాత ఒక సినిమా రిలీజ్ చేయడానికి షూటింగ్ని శరవేగంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క రాజకీయాలు మరియు పార్టీ సమావేశాలు అన్నీ జరుపుతూనే మరోపక్క ఎంతో డెడికేటెడ్ గా సినిమాల కోసం వర్క్ చేస్తూ పవన్ వర్క్ మీద తనకున్న డెడికేషన్ ని ప్రూవ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న నాలుగైదు సినిమాలలో ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ హిట్ అన్న టాక్ నడుస్తోంది.
అందులో ముఖ్యంగా హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 11 సంవత్సరాల క్రితం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో ఓ భారీ రికార్డు చిత్రమని చెప్పవచ్చు. మరి ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తిరిగి వస్తున్నా ఈ చిత్రం అంతకుమించి ఉంటుంది అని ఫాన్స్ ఆశపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా చిత్రం నుంచి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా మరోసారి గబ్బర్ సింగ్ స్టైల్ ను మించి అన్నట్లుగా ఉన్న ఈ వీడియోను ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా 70 ఎం ఎం థియేటర్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ సంచలనంగా మారింది.
ఈ వీడియో పై రామ్ చరణ్ (Ram Charan) కూడా స్పందించారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ అన్న మాటలు నెట్ లో వైరల్ అయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్ (Ustaad Bhagat Singh Glimpse) తనకు చాలా బాగా నచ్చిందని…. ఇటువంటి భారీ మాస్ ఎంటర్టైనర్ను థియేటర్లో చూడడానికి వెయిట్ చేయడం తన వల్ల కావట్లేదని…మూవీ టీం అందరికీ గుడ్ లక్ విష్ చేస్తూ రామ్ చరణ్ తన మనసులోని అభిప్రాయాలను ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ ట్వీట్ నెట్లో బాగా వైరల్ అయింది. రామ్ చరణ్ ని కాదు మొత్తం పవన్ అభిమానులు అందరూ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Web Title: Ram Charan comment on Pawan Kalyan Ustaad Bhagat Singh Glimpse, Ram Charan, Pawan Kalyan, Harish Shankar, Sreeleela, Ram Charan about Ustaad Bhagat Singh movie, Game Changer