Game Changer climax shoot: రామ్ చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు. దర్శకుడు శంకర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ గా తర్కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి అంచనాలను తగ్గలేదు ఫాన్స్ లో.. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Game Changer climax shoot: కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాటలను దాదాపు 90 కోట్ల పైనే బడ్జెట్తో నిర్మించినట్టు కథనాలు అయితే నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. మామూలుగానే శంకర్ సినిమా అంటే సాంగ్స్ కి ప్రత్యేకమైన బడ్జెట్ ని ఏర్పాటు చేస్తారు నిర్మాతలు. మరి ఇది ఎంతవరకు నిజమా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనితో పాటు గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ కూడా షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ ని షూటింగ్ చేయటానికి 500 మంది ఫైటర్స్ ని ఉపయోగించినట్టు సినిమా వర్గాల నుండి సమాచారం తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశం దాదాపు 20 నిమిషాలు దాకా ఉంటుందని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెల్స్ తెలుగు సినిమాలో మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయన్న చర్చ నడుస్తోంది.
యాక్షన్ మరియు ఎమోషనల్ కనెక్షన్‌ల సమ్మేళనంతో, క్లైమాక్స్ వీక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతున్న కొద్దీ, అభిమానులు మరియు మూవీ లవర్స్ ఈ ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌ను పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని సంక్రాంతికి లేదా సమ్మర్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.