Ram Charan’s Game Changer Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గేమ్ చేంజెస్ టైటిల్ పోస్టర్ అలాగే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ సినిమాపై భారీగానే అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తరగెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్గా చేస్తుంది. గేమ్ చేజర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ చేసినట్టు దర్శకుడు శంకర్ సోమవారం అప్డేట్ ఇవ్వడం జరిగింది.
Ram Charan’s Game Changer Release Date: నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తలకెక్కిస్తున్నా ఈ సినిమాలో అంజలి, ఎస్ జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రకని, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాల అలాగే మిగతావారు కీలకమైన పాత్రలో చేస్తున్నారు. అయితే గేమ్ చేజర్ రిలీజ్ డేట్(Game Changer Release Date) గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ మొదటిసారిగా పొలిటికల్ డ్రామా తో వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 22న విడుదల చేయుటకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ మీడియా కూడా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ (Game Changer Release Date) ఇదే అంటూ ప్రచారం కూడా చేస్తున్నాయి. మొదటగా సంక్రాంతి 2024 డేట్ అనుకున్నప్పటికీ.. అదే డేట్ కి మరికొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండడంతో మూవీ మేకర్స్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) మూవీని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారంట. కానీ ఇక్కడ నిర్మాత దిల్ రాజు ప్లానింగ్ సూపర్ అని చెప్పాలి ఎందుకంటే.. ఒకవైపు క్రిస్టమస్ హాలిడేస్ వస్తాయి అలాగే న్యూ ఇయర్ హాలిడేస్ కూడా ఉంటాయి. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ వసూళ్లు పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫిక్స్ చేసుకున్న టార్గెట్ రీచ్ అవటం చాలా సులువు.
మరి నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ విడుదల (Game Changer release Date) తేదీని డిసెంబర్ 22 ఫిక్స్ చేస్తారా లేదంటే వేరే డేట్ ని చూస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమా కాదు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
రామ్ చరణ్ ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే శంకర్ అలాగే నిర్మాతలు కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది. మరి రిలీజ్ డేట్ మీద క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే