రామ్ చరణ్ అలాగే శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ గా మారిన విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ షూటింగ్ నుండి లీక్ అయిన ఫొటోస్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. చరణ్ ని ఎలాంటి పాత్రలో చూపిస్తారు అంటూ ఇప్పటికే ఫాన్స్ లోనూ అలాగే మూవీ లవర్స్ ఆత్రుతంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిథ్యమైన పాత్రలు పోషిస్తున్నాడని సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి.
అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగు ప్రస్తుతం 70% కంప్లీట్ అయినట్టు సమాచారం. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూటింగ్ కూడా కొన్ని నెలల క్రితం దర్శకుడు శంకర్ కంప్లీట్ చేయడం జరిగింది. తాజాగా హైదరాబాద్లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ని ప్రారంభించడం జరిగింది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ తో పాటు మిగిలిన తారాగణం కూడా పాల్గొన్నారు.
గేమ్ చేంజర్ కొత్త షూటింగు హైదరాబాదులోనే రెండు వారాలు పాటు జరగనుంది. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు మిగతా తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారంటూ మూవీ వర్గాల నుండి అందుతున్న సమాచారము. ఈ కొత్త షెడ్యూల్ ఆగస్టు 21 కి పూర్తయ్య అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

సోషల్ మీడియాలో కథనాల ప్రకారము రామ్ చరణ్ ఈ సినిమాలో డబల్ రోల్ చేస్తున్నారు. తండ్రి పాత్రలో ఐఏఎస్ గా అలాగే కొడుకు పాత్రలో రాజకీయ నేతగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనబడ పోతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై కూడా సరైన క్లారిటీ లేదు. సంక్రాంతి…సమ్మర్ అంటూ కొన్ని తేదీలు తెరపైకి వస్తున్నప్పటికీ క్లారిటీ అయితే లేదు. మరి దిల్ రాజు ఈ సినిమా కోసం ఎటువంటి ప్లాన్ చేస్తున్నారో చూడాలి.