చిరు కాదు.. చరణ్ నక్సలైట్.. నిజమేనా ?

Ram Charan guest role in Chiranjeevi, Koratala Siva film
Ram Charan guest role in Chiranjeevi, Koratala Siva film

(Ram Charan guest role in Chiranjeevi, Koratala Siva film Chiru152, Chiranjeevi next movie latest updates and shooting details..)మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. త్రిష హీరోయిన్. యంగ్ హీరోయిన్ రెజీనా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఈ సినిమాలో చిరు నక్సలైట్ గా కనిపిస్తారని.. ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ లో అలా కనిపిస్తారనే ప్రచారం మొదట్లో జరిగింది. ఇందులో రామ్ చరణ్ కూడా నటించనున్నారనే వార్తలు చాలారోజుల వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఇందులో చెర్రీ యుక్త వయసులోని చిరు పాత్రలో అది కూడ నక్సలైట్‌గా కనిపిస్తారని తెలుస్తోంది.

రాజమౌళి సినిమా షూటింగ్ ముగియగానే చరణ్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట. ఈ లోపు కొరటాల చరణ్ పార్ట్ మినహా మిగతా షూట్ పూర్తిచేస్తారట. ఓ 30 నిమిషాల పాత్రలో చరణ్ కనిపిస్తారని.. ఆయన నక్సలైట్ పాత్రలో మెరుస్తారని చెప్పుకొంటున్నారు. ఇక చరణ్ కి జంటగా సమంత కనిపించబోతుందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.ఇక ఈ సినిమా జెడ్ స్పీడుతో చిత్రీకరిస్తున్నారు. కేవలం 90 రోజుల లోపు సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బడ్జెట్ ని కంట్రోల్ చేయాలనే లక్ష్యంతోనే జెడ్ స్పీడుతో షూటింగ్ కానిచ్చేస్తున్నారని చెబుతున్నారు.